Jio Recharge Plan : రిలయన్స్ జియో చౌక రీఛార్జ్ ప్లాన్.. ధర, వ్యాలిడిటీ వివరాలివీ
మరో చౌక ప్రీపెయిడ్ ప్లాన్‌ను రిలయన్స్ జియో అందుబాటులోకి తీసుకొచ్చింది. దాని ధర రూ.198.దీని వ్యాలిడిటీ 14 రోజులు.
- By Pasha Published Date - 03:41 PM, Tue - 20 August 24

Jio Recharge Plan : మరో చౌక ప్రీపెయిడ్ ప్లాన్‌ను రిలయన్స్ జియో అందుబాటులోకి తీసుకొచ్చింది. దాని ధర రూ.198.దీని వ్యాలిడిటీ 14 రోజులు. ఈ రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత వాయిస్ కాలింగ్ లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను పంపొచ్చు. 2జీబీ ఇంటర్నెట్ సౌకర్యం కూడా వస్తుంది. అయితే కొందరు ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రం 5జీ డేటాను జియో అందిస్తోంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్‌లను కూడా ఉచితంగా(Jio Recharge Plan) వాడుకోవచ్చు.
We’re now on WhatsApp. Click to Join
దీంతోపాటు రూ.189, రూ.199తోనూ మరో రెండు చౌకైన రీఛార్జి ప్లాన్లను జియో తీసుకొచ్చింది. రూ.199 రీఛార్జి ప్లాన్ వ్యాలిడిటీ 18 రోజులు ఉంటుంది. దీనితో రోజుకు రూ.1.5 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు చేసుకోవచ్చు. అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. జియో యాప్‌లు ఉచితంగా వాడుకోవచ్చు. ఇక జియో తీసుకొచ్చిన రూ.189 రీఛార్జ్ ప్లాన్ విషయానికొస్తే.. అందులో 2జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 300 ఎస్ఎంఎస్‌లు చేసుకోవచ్చు. అపరిమిత వాయిస్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంటుంది.
Also Read :Supreme Court : జడ్జీలు తీర్పుల్లో ప్రవచనాలు చెప్పొద్దు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
మరోవైపు బీఎస్‌ఎన్‌ఎల్ చాలా పుంజుకుంది. జియో, ఎయిర్‌టెల్‌లు రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచిన తర్వాత చాలామంది కస్టమర్లు బీఎస్ఎన్‌ఎల్‌కు మారిపోతున్నారు. చౌకగా రీఛార్జ్ ప్లాన్లు ఉండటంతో చాలామంది మళ్లీ బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ ప్రవేశపెట్టిన రూ.997 రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 160 రోజులు. దీనిలో రోజుకు 2జీబీ ఇంటర్నెట్ లభిస్తుంది. 320 జీబీ హై స్పీడ్ డేటా వస్తుంది. రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లను ఉచితంగా పంపొచ్చు. అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. దేశంలోని అన్ని టెలికాం సర్కిళ్లలో 4జీ సేవలను ప్రారంభించేందుకు బీఎస్ఎన్‌ఎల్ సన్నాహాలు చేస్తోంది. త్వరలో 5జీ సేవలను సైతం ప్రారంభించేందుకు రెడీ అవుతోంది.