CBN : రాజమండ్రి టూ ఉండవల్లి .. 14 గంటల పాటు సుధీర్ఘ ప్రయాణం.. అడుగడుగునా ఘన స్వాగతం పలికిన ప్రజలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి నుంచి అమరావతికి రావడానికి దాదాపు 14 గంటల సమయం పట్టింది. నిన్న
- Author : Prasad
Date : 01-11-2023 - 8:23 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి నుంచి అమరావతికి రావడానికి దాదాపు 14 గంటల సమయం పట్టింది. నిన్న సాయంత్రం రాజమండ్రి జైలు నుంచి బయటికి వచ్చిన చంద్రబాబు.. నేరుగా ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అయితే చంద్రబాబుకు బెయిల్ వచ్చిందనే వార్త తెలుసుకున్న టీడీపీ కార్యర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో రాజమండ్రి చేరుకున్నారు. రాజమండ్రి నుంచి అడుగడుగునా ప్రజలు చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టారు. కోర్టు షరతుల నేపథ్యంలో చంద్రబాబు కారులో ఉండే ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బాబు బయటికి వచ్చిన సందర్భంగా కన్వాయ్ ముందు బాణాసంచా కాల్చి టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. 53 రోజుల తరువాత చంద్రబాబు ను చూసేందుకు అర్థరాత్రి వరకు మహిళలు, యువకులు, వృద్ధులు రోడ్లపైనే వేచి ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
నిర్విరామంగా సుదీర్ఘ ప్రయాణంతో చంద్రబాబు నాయుడు అలసిపోయారు .చంద్రబాబు ఉండవల్లి నివాసానికి రాగానే నాయకులు, కార్యకర్తలు, అమరావతి రైతులు ఉద్విగ్నానికి గురైయ్యారు. జై చంద్రబాబునాయుడు, లాంగ్ లివ్ చంద్రన్న అంటూ నినాదాలు చేశారు చంద్రబాబునాయుడు ఇంటివద్దకు అమరావతి రైతులు, మహిళలు భారీగా తరలివచ్చారు. ఉండవల్లి నివాసం వద్ద గుమ్మడికాయల దిష్టితీస్తూ చంద్రబాబు నాయుడకు హరతులు పట్టారు. రాజమండ్రి జైలు వద్ద నుంచి నిన్న సాయంత్రం 4.15గంటలకు బయలుదేరిన టిడిపి అధినేత చంద్రబాబు… ఉండవల్లికి తెల్లవారుజామున 5.45 నిమిషాలకు వచ్చారు. ఉండవల్లి నివాసంలో టీడీపీ సీనియర్ నేతలు నక్కా ఆనంద్‌బాబు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఇతర నేతలంతా చంద్రబాబుని కలిసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
Also Read: Chandrababu : ఇవాళ హైదరాబాద్‌కు చంద్రబాబు.. అచ్చెన్నాయుడు ఏమన్నారంటే ?