Chandrababu : ఇవాళ హైదరాబాద్‌కు చంద్రబాబు.. అచ్చెన్నాయుడు ఏమన్నారంటే ?
Chandrababu : కోర్టు ఆదేశాలతో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు తిరుమల పర్యటన రద్దయింది.
- Author : Pasha
Date : 01-11-2023 - 7:00 IST
Published By : Hashtagu Telugu Desk
Chandrababu : కోర్టు ఆదేశాలతో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు తిరుమల పర్యటన రద్దయింది. ఈరోజు చంద్రబాబు రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఆయన హైదరాబాద్‌లో వైద్య పరీక్షలు చేయించుకుంటారు. హైదరాబాద్‌లో చంద్రబాబు ఎవరినీ కలవరని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు వెల్లడించారు. కోర్టు ఆర్డర్స్ అమలు కోసం టీడీపీ కార్యకర్తలు, నాయకులు సహకరించాలని కోరారు.
We’re now on WhatsApp. Click to Join.
ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు మంగళవారం సాయంత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఆసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 52 రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు తనకు అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. తన కుటుంబానికి అండగా ఉంటూ, తన విడుదల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టివారికి ధన్యవాదాలు తెలిపారు. అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ జీవితాంతం తోడుగా ఉంటానన్నారు.
Also Read: world cup 2023: భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ కోసం భారీ ధరకు టికెట్స్
మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యే సండ్ర హర్షం..
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా చంద్రబాబు విడుదలవడంతో సంతోషం వ్యక్తం చేశారు. న్యాయం గెలిచిందని వ్యాఖ్యానించారు. రాజమండ్రి జైలు నుంచి బాబు విడుదల సందర్భంగా.. లాకారం ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన సంబరాల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో.. చంద్రబాబు విడుదలైనందుకు గానూ బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. కోకాపేట్ మూవీ టవర్స్, కూకట్పల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలైన సందర్భంగా టీడీపీ మద్దతుదారులు సంబురాలు (Chandrababu) జరుపుకున్నారు.