HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nara Brahmani Features In Fortune India List Nara Lokesh Posts Emotional Tweet

Nara Brahmani: నారా బ్రాహ్మణికి ‘ఫార్చ్యూన్‌ ఇండియా’ జాబితాలో చోటు.. నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్

  • Author : Vamsi Chowdary Korata Date : 11-07-2026 - 11:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Brahmani features in 'Fortune India' list; Nara Lokesh posts emotional tweet.
Nara Brahmani features in 'Fortune India' list; Nara Lokesh posts emotional tweet.

హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, యువ పారిశ్రామికవేత్త నారా బ్రాహ్మణి మరో అరుదైన జాతీయ స్థాయి గౌరవాన్ని అందుకున్నారు. ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ ఇండియా ఏటా ప్రకటించే ‘100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్’ (100 మంది అత్యంత ప్రభావశీల మహిళలు) 2026 జాబితాలో ఆమెకు చోటు దక్కింది. వ్యాపారం, పరిశ్రమలు, నాయకత్వం, సామాజిక సేవ వంటి రంగాల్లో విశేషమైన కృషి చేసి, తమదైన ముద్ర వేసిన మహిళలకు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో స్థానం కల్పిస్తారు. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను విజయపథంలో నడిపిస్తున్నందుకు గాను బ్రాహ్మణి ఈ గుర్తింపును పొందారు.

So proud to see Brahmani named one of Fortune India’s 100 Most Influential Women! Keep shining, leading, and breaking barriers!@brahmaninara https://t.co/dHr0d1nfnI pic.twitter.com/xT1Frmh9s8

— Lokesh Nara (@naralokesh) July 11, 2026

ఈ విజయం పట్ల ఆమె భర్త, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. “ఫార్చ్యూన్ ఇండియా 100 మంది ప్రభావశీల మహిళల జాబితాలో బ్రాహ్మణి చోటు సంపాదించడం ఎంతో గర్వంగా ఉంది. ఇలాగే ముందుకు సాగుతూ మరెన్నో విజయాలు సాధించాలి. అడ్డంకులను చెరిపేస్తూ మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలి” అంటూ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా అభినందనలు తెలిపారు.

Heartiest congratulations to Brahmani on being recognised among Fortune India’s 100 Most Powerful Women 2026. This prestigious recognition reflects her leadership, dedication, and commitment to excellence.

She continues to make our family proud while inspiring countless young… pic.twitter.com/KoKjDkvTK6

— N Chandrababu Naidu (@ncbn) July 11, 2026

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా తన కోడలు సాధించిన ఈ ఘనతపై ప్రత్యేకంగా స్పందించి ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా ఓ పోస్ట్ చేశారు. “ఫార్చ్యూన్ ఇండియా 100 మంది శక్తిమంతమైన మహిళల జాబితాలో గుర్తింపు పొందిన బ్రాహ్మణికి హృదయపూర్వక అభినందనలు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు ఆమె నాయకత్వ పటిమ, అంకితభావం, నిబద్ధతకు నిదర్శనం” అని పేర్కొన్నారు.

అంతేకాకుండా “ఆమె మా కుటుంబానికి గర్వకారణంగా నిలుస్తూనే, ఎందరో యువతులకు, ముఖ్యంగా మన తెలుగు ఆడబిడ్డలకు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా స్ఫూర్తినిస్తోంది. భవిష్యత్తులో ఆమె మరిన్ని మైలురాళ్లను అధిగమించి, అన్ని ప్రయత్నాల్లోనూ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అని చంద్రబాబు తన పోస్టులో తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM Chandrababu Naidu
  • Fortune India
  • Heritage Foods
  • Minister Nara lokesh
  • nara brahmani

Related News

Korean companies set to queue up for AP

Nara Lokesh: ఏపీకి క్యూ కట్టనున్న కొరియా కంపెనీలు

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నేడు బుసాన్ నగరంలో కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వానికి, కొరియా కంపెనీలకు మధ్య వారధిగా నిలిచేందుకు ఏపీఈడీబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అపెక్స్-కొరియా’ సహాయ కేంద్రాన్ని ఆయన లాంఛనంగా ప్రార

  • Good news from the AP government for BCs...

    APSPDCL: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీకి గ్రీన్ సిగ్నల్

Latest News

  • Businessman Missing: స్విట్జర్లాండ్ విహారయాత్రలో అదృశ్యమైన హైదరాబాద్ దంపతులు.. రూ. 50 కోట్ల కుంభకోణంలో పోలీసుల దర్యాప్తు!

  • Home Loan Rates: ఇల్లు కొనాలనుకుంటున్నారా? జూలై నెలలో హోంలోన్లపై రుణ వడ్డీ రేట్లు ఎంత ఉందంటే?

  • Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత వార్నింగ్

  • Nara Brahmani: నారా బ్రాహ్మణికి ‘ఫార్చ్యూన్‌ ఇండియా’ జాబితాలో చోటు.. నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్

  • Tirumala: అలిపిరి మెట్ల మార్గంలో చిరుత హల్ చల్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd