Nara Bhuvaneswari : రాష్ట్రాన్ని కూల్చే పాలన కావాలా? నిర్మించే పాలన కావాలా? – నారా భువనేశ్వరి
- Author : Prasad
Date : 07-03-2024 - 8:26 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ ను కూల్చే ప్రభుత్వం కావాలా? నిర్మించే పాలన కావాలో రాష్ట్ర ప్రజలే తేల్చుకోవాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి పర్యటన సందర్భంగా అనంతపురంజిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం ఆమె పర్యటించారు. నారా భువనేశ్వరికి నియోజకవర్గ మహిళలు పెద్దఎత్తున సంఘీభావం తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని భువనేశ్వరి ఆరోపించారు. మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్ తో గుద్ది చంపడం, కళ్లు పీకేయడం వంటి దుర్మార్గపు చర్యలకు వైసీపీ రౌడీ మూకలు దిగుతున్నారని.. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాక్షసుల పాలనలో ఉన్నామా? లేక బ్రిటీషు వారి చేతిలో బానిసల్లా ఉన్నామా? ప్రజలు ఆలోచించాలన్నారు. చంద్రబాబు పాలనలో ధైర్యంగా బ్రతికిన మహిళలు నేడు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారన్నారు. వైసీపీ నాయకులు మహిళలు అని కూడా చూడకుండా రాడ్లతో కొట్టి చంపాలని చూస్తున్నారు. నాయకుడు ఎలా ఉన్నాడో క్రింద ఉన్న వైసీపీ కార్యకర్తలు కూడా అలాగే ఉన్నారని.. చంద్రబాబు పాలనలో 8ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే నిందితుడిని ప్రభుత్వం ఎలా శిక్షిస్తుందోననే భయంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని గుర్తు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
మహిళలకు ఏదైనా జరిగితే చంద్రబాబు ఆ స్థాయిలో స్పందించి చర్యలు తీసుకునేవారని భువనేశ్వరి తెలిపారు. అమరావతి రైతులు 1600రోజులుగా రాజధాని కోసం పోరాటం చేస్తున్నారని.. అమరావతి మహిళలపై వైసీపీ ప్రభుత్వం అత్యంత కర్కశంగా వ్యవహరించిందన్నారు. గర్భిణి కడుపై పోలీసులు తన్నడంతో బిడ్డల్ని కూడా కోల్పోయారని.. రాత్రిపూట కూడా స్టేషన్లలో నిర్బంధించినా మహిళలు ఎక్కడా తగ్గకుండా తమ పోరాటాలను కొనసాగించారని భువనేశ్వరి తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో శాంతియుత ర్యాలీలు, నిరసనలు చేసిన మహిళలపైనా వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు..అక్రమ కేసులు పెట్టింది. రాత్రిపూట కూడా మహిళలను స్టేషన్లలో ఉంచి ఇబ్బందులు పెట్టారని.. తెలుగుదేశం కార్యకర్తలను గత నాలుగున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం చిత్రహింసలు పెడుతూనే ఉందని.. అక్రమ కేసులు పెడుతూనే ఉందన్నారు. నందం సుబ్బయ్య, తోట చంద్రయ్య వంటి కార్యకర్తలను నడిరోడ్డుపై గొంతుకోసి చంపేసిన దుర్మార్గపు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో ఓటు అనే ఆయుధంతో రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు.
Also Read: Anant-Radhika: అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వేడుకలో ఎవరెంత తీసుకున్నారంటే..?