HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nagababu Becomes Mlc Best Wishes To His Younger Brother Ambati Satirlu

MLC : నాగబాబుకు ఎమ్మెల్సీ..తమ్ముడికి శుభాకాంక్షలు : అంబటి సెటైర్లు

మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని సోషల్ మీడియా వేదికగా అంబటి రాంబాబు తప్పుబట్టారు. ‘‘అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు’’ అని ట్వీట్టర్‌ లో పేర్కొన్నారు.

  • Author : Latha Suma Date : 06-03-2025 - 4:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nagababu becomes MLC..Best wishes to his younger brother: Ambati Satirlu
Nagababu becomes MLC..Best wishes to his younger brother: Ambati Satirlu

MLC : ఇటీవల ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడంతో ఆ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయడానికి నిర్ణయించారు. ఈ క్రమంలో కూటమి పార్టీల నుంచి కూడా ఈ ఐదుగురు ఎమ్మెల్సీలను నియమించడానికి రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ నుంచి మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు పేరును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నాగబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Hair Stolen: తెలుగులో మాట్లాడుతూ చోరీ.. రూ.1 కోటి జుట్టు మాయం

దీంతో నాగబాబును MLC గా ప్రకటించడంపై మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని సోషల్ మీడియా వేదికగా అంబటి రాంబాబు తప్పుబట్టారు. ‘‘అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు’’ అని ట్వీట్టర్‌ లో పేర్కొన్నారు. కాగా, శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జన సేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఖరారు చేశారు. ఈ మేరకు బుధవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

కాగా, ప్రస్తుతం నాగబాబు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీకి సేవలందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయాలని నాగబాబుకు పార్టీ సమాచారం ఇచ్చింది. పార్టీ పరంగా కూడా నామినేషన్‌కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పవన్‌కళ్యాణ్‌ ఆదేశించారు. ఇకపోతే..అటు కూటమి ప్రభుత్వం నాగబాబుకు మంత్రి పదవిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఎమ్మెల్సీతో నాగబాబుని ఆపేస్తారా? లేక మంత్రివర్గంలోకి తీసుకుంటారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నాగబాబు మంత్రి అయితే అన్నదమ్ములిద్దరూ మంత్రులుగా ఉన్న ఏకైక సభగా ఇది గుర్తింపు పొందనుందా.. అనే చర్చ జరుగుతోంది.

Read Also: Book Release Event : ఒకే వేదికపై చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ambati Rambabu
  • Deputy CM Pawan Kalyan
  • Konidela Nagababu
  • MLC
  • MLC seats
  • ysrcp

Related News

Supreme Court

Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు అజారుద్దీన్‌, కోదండ‌రాంల నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ పిటిషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నామినేషన్లకు సంబంధించిన ఫైళ్లు, ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే సమర్పించాలని కోరిన పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరిస్తూ తదుపరి విచారణను జూలై 22కు వాయిదా వేసింది. జస్టిస్ విక్ర‌మ్ నాథ్‌, జస్టిస్ సందీప్ మెహ‌తాలతో కూ

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Imresizer Whatsapp Image 2026 05 29 At 4.10.59 Pm

    TDP : యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన చరిత్ర జగన్ కుటుంబానిదే: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి

  • Ys Sharmila

    YS Sharmila : రాజారెడ్డి, YSR పేర్లపై రాజకీయాలు చేయొద్దు.. టీడీపీకి షర్మిల కౌంటర్

  • Sai Vaishnavi Nellore

    Nellore : రాజ‌కీయాల్లోకి కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి కుమార్తె.. ఫ‌స్ట్ ప్రెస్‌మీట్‌లోనే అద‌ర‌గొట్టిన సాయివైష్ణ‌వి

Latest News

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

  • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd