MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలను సీఈసీ నిర్వహించనుంది. ఏపీ, తెలంగాణలో ఐదుగురు చొప్పున మొత్తం 10 మంది పదవీకాలం ముగియనుంది.
- Author : Latha Suma
Date : 24-02-2025 - 3:00 IST
Published By : Hashtagu Telugu Desk
MLC Elections : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) విడుదల చేసింది. మార్చి 3న నోటిఫికేషన్.. మర్చి 20న పోలింగ్, కౌంటింగ్ జరగనున్నాయి. తెలంగాణలో 5 , ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 29తో ఏపీలోని ఐదుగురు, తెలంగాణలోని ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలను సీఈసీ నిర్వహించనుంది. ఏపీ, తెలంగాణలో ఐదుగురు చొప్పున మొత్తం 10 మంది పదవీకాలం ముగియనుంది.
Read Also: Pawan Kalyan : వైసీపీకి ఐదేళ్లు ప్రతిపక్ష హోదా రాదు : డిప్యూటీ సీఎం
ఏపీలో మార్చి 29 నాటికి యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, పి.అశోక్‌బాబు, తిరుమలనాయుడు, దువ్వారపు రామారావు పదవీకాలం ముగియనుంది. తెలంగాణలో పదవీకాలం ముగిసే వారిలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హాసన్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ముఖ్యమైన తేదీలు..
ఎన్నికల నోటిఫికేషన్ జారీ: మార్చి 3
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం: మార్చి 10
నామినేషన్ల పరిశీలన: మార్చి 11
నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 13
పోలింగ్: మార్చి 20 (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు)
ఓట్ల లెక్కింపు: మార్చి 20 (పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి)

Read Also: Ambati Rambabu : ఏపీలో పవన్ ఎప్పటికి సీఎం కాలేడు – అంబటి కౌంటర్