HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Minister Nara Lokesh Clarifies The Image In The Prayer Room

Nara Lokesh: పూజ గదిలో బొమ్మపై క్లారిటీ ఇచ్చిన మంత్రి నారా లోకేశ్‌

  • Author : Vamsi Chowdary Korata Date : 20-03-2026 - 12:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Lokesh Tweet
Nara Lokesh Tweet

Nara Lokesh  ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ఉగాది పర్వదినం సందర్భంగా సోషల్ మీడియాలో పంచుకున్న ఓ ఫొటో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన పూజగదిలో కనిపించిన ఓ బొమ్మపై కొందరు నెటిజన్లు క్షుద్రపూజలంటూ ఆరోపణలు చేయడంతో లోకేశ్‌ స్వయంగా రంగంలోకి దిగి ఆ వాదనలను ఖండిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు.

తెలుగు ప్రజలంతా ఉగాది పండుగను కుటుంబసభ్యులతో కలిసి వైభవంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేశ్‌ కూడా తన నివాసంలో కుటుంబంతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. తన కుమారుడు దేవాన్ష్‌తో కలిసి పండుగ చేసుకుంటున్నానని, “నా ఛాంప్‌తో ఉగాది” అంటూ ఓ పోస్ట్ పెట్టారు. ఈ ఒక్కరోజు తన కఠినమైన డైట్‌కు విరామం ఇచ్చి పండుగ వంటకాలను ఆస్వాదిస్తానని పేర్కొంటూ, పూజగదిలోని కొన్ని ఫొటోలను ఎక్స్‌లో షేర్ చేశారు.

అయితే, లోకేశ్‌ పంచుకున్న ఫొటోలలో ఒకటి వివాదానికి కేంద్ర బిందువైంది. పూజగదిలో దేవుడి పటాల పక్కన మట్టితో చేసినట్లుగా ఉన్న ఓ బొమ్మ కనిపించడంతో సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. “పవిత్రమైన దేవుడి మందిరంలో క్షుద్రపూజలకు వాడే చేతబడి బొమ్మ ఎందుకు ఉంది?” అంటూ కొందరు నెటిజన్లు ఆయనను ప్రశ్నించారు. ఈ ఆరోపణలు వేగంగా వ్యాపించడంతో లోకేశ్‌ పూజగదిలో క్షుద్రపూజలు చేస్తున్నారంటూ ప్రచారం ఊపందుకుంది.

Nara Lokesh Tweet

Nara Lokesh Tweet

ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా వస్తున్న ఆరోపణలపై మంత్రి లోకేశ్‌ స్పందించారు. తన పూజగదిలోని బొమ్మ వెనుక ఉన్న అసలు కథను వివరిస్తూ ఓ ట్వీట్ చేశారు. “మా పూజ గదిలోని బొమ్మల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారి కోసం.. ఇది దేవాన్ష్ తన నాలుగేళ్ల వయసులో చేతితో తయారు చేసిన శివుని బొమ్మ. దాని పక్కన చిన్న శివలింగం ఉన్నాయి. దేవాన్ష్ శివుడిపై ఉన్న భక్తితో వీటిని తయారు చేశాడు. దానిని ఒక జ్ఞాపకంగా మేము పూజ గదిలో ఉంచాము” అని లోకేశ్‌ స్పష్టం చేశారు.

అనంతరం, “కొందరికి విశ్వాసం అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు. కానీ ఇలాంటి భక్తికి వివరణ అవసరం లేదు. హరహరమహాదేవ్” అంటూ తన ట్వీట్‌ను ముగించారు. తన కుమారుడి సృజనను, భక్తిని క్షుద్రపూజలతో ముడిపెట్టడంపై ఆయన పరోక్షంగా అసహనం వ్యక్తం చేశారు. ఈ వివరణతో సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి ఆయన తెరదించే ప్రయత్నం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • ap minister
  • Devansh
  • Minister Nara lokesh
  • nara lokesh
  • Nara Lokesh Tweet
  • pooja room
  • social media trolls
  • telugu news
  • trolls
  • Ugadi 2026

Related News

government-gives-green-signal-for-prosecution-of-kodali-nani

Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021 పంచాయతీ ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో విచారణ ముందుకు సాగనుంది. పంచాయతీ ఎన్నికల సమయంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే విధంగా ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్

  • Simply placing these items in your home's prayer room is enough—you are sure to receive Goddess Lakshmi's blessings!

    Lakshmi Devi: ఈ వస్తువులను మీ ఇంట్లోని పూజ గదిలో పెడితే చాలు.. లక్ష్మీ అనుగ్రహం కలగడం ఖాయం!

  • Iran and the US sign peace agreement.

    US-Iran Peace Deal: శాంతి ఒప్పందంపై ఇరాన్, అమెరికా సంతకాలు

  • Big alert for candidates: NEET 're-exam' date fixed.

    NEET: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. నీట్‌ ‘రీ–ఎగ్జామ్‌’ డేట్ ఫిక్స్

Latest News

  • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

  • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

  • TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

  • IMD Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

  • Telegram Banned: టెలిగ్రామ్ యాప్‌పై బ్యాన్‌.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd