Jogi Ramesh: ఆ రాయి చంద్రబాబు వేయించుకున్నదే…!!
- Author : hashtagu
Date : 04-11-2022 - 9:50 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత కాన్వాయ్ పై రాళ్లదాడితో మరోసారి ఏపీలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై టీడీపీ అధికార పార్టీపై తీవ్రంగా మండిపడుతోంది. అయితే ప్రతిపక్షానికి దీటుగా అధికారపార్టీ బదులిచ్చింది. చంద్రబాబు తన కాన్వాయ్ పై తాను రాయి విసిరించుకున్నారని మంత్రి జోగురమేశ్ ఆరోపించారు. ఇది చంద్రబాబు ఆడుతున్న కొత్త నాటకం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనలో సెక్యూరిటీ ఆఫీసర్ కు గాయాలు కావడం బాధకరమన్నారు. ఈ ఘటనకు కారణమైన చంద్రబాబు సెక్యూరిటీ ఆఫీసర్ కు క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులను పోటీలో దింపే ధైర్యం చంద్రబాబు ఉందా అంటూ ప్రశ్నించారు. తాను సీఎం అభ్యర్థినని చెప్పే దమ్ము పవన్ కల్యాణ్ కు ఉందా అని నిలదీశారు. పొత్తులతోనే అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తు్నారని… అది సాధ్యం కాని పని అని అన్నారు.