ysrcp : వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థుల జాబితా వెల్లడి
- Author : Latha Suma
Date : 16-03-2024 - 1:33 IST
Published By : Hashtagu Telugu Desk
ysrcp MLA, MP Candidates list : వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థుల జాబితాను మంత్రి ధర్మాన వెల్లడిస్తున్నారు. కడప జిల్లా ఇడుపుల పాయలో సమావేశంలో ప్రకటిస్తున్నారు. స్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం సీట్లు, ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 29 ఎస్సీ, 7 ఎస్టీ, 48 బీసీలు ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 7 మైనారిటీలు, 19 మంది మహిళలు, 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ సీట్లలో 50 శాతం ఓసీలకు కేటాయించినట్లు వివరించారు.
వైఎస్‌ఆర్‌సిపి అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థుల ప్రకటన
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం సీట్లు
ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 29 ఎస్సీ, 7 ఎస్టీ, 48 బీసీలు
ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 7 మైనారిటీలు, 19 మంది మహిళలు
175 ఎమ్మెల్యే, 25 ఎంపీ సీట్లలో 50 శాతం ఓసీలకు

We’re now on WhatsApp. Click to Join.
వైఎస్‌ఆర్‌సిపి లోక్ సభ అభ్యర్థులు వీరే..
శ్రీకాకళం – పేరాడ తిలక్ (బీసీ)
విజయనగరం – బెల్లాన చంద్రశేఖర్ (బీసీ)
విశాఖపట్టణం – డాక్టర్ బొత్సా ఝాన్సీ లక్ష్మీ (బీసీ)
అరకు – శెట్టి తనూజారాణి (ఎస్టీ)
కాకినాడ – చలమశెట్టి సునీల్ (ఓసీ)
అమలాపురం -రాపాక వరప్రసాద్ (ఎస్సీ)
రాజమండ్రి – గూడూరు శ్రీనివాస్ రావు (బీసీ)
read also: Pokhran – Top 10 : అణు పరీక్షల గడ్డ ‘పోఖ్రాన్’.. విశేషాలు ఇవిగో
కాగా, ఇడుపుల పాయకు సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. వైఎస్ఆర్ సమాధి వద్ద పూలమాలలతో జగన్ మోహన్ రెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి నేతలు నివాళులర్పించారు. అనంతరం ఇడుపులపాయ వద్దనే 175అసెంబ్లీ, 25 లోక్ సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల వివరాలను ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ధర్మాన ప్రసాదరావు వెల్లడిస్తున్నారు.
వైసీపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ విడుదల pic.twitter.com/zUVCD7qcgt
— Telugu Scribe (@TeluguScribe) March 16, 2024