Minior Boy Killed : ఏలూరులో మైనర్ బాలుడు దారుణ హత్య.. పాఠశాల ఆవరణలోనే.. ?
ఏలూరులోని గిరిజన హాస్టల్‌లో కిడ్నాప్ అయిన బాలుడు శవమై కనిపించాడు. ఏలూరు జిల్లా పులిరాముడుగూడెం గిరిజన సంక్షేమ
- Author : Prasad
Date : 12-07-2023 - 8:05 IST
Published By : Hashtagu Telugu Desk
ఏలూరులోని గిరిజన హాస్టల్‌లో కిడ్నాప్ అయిన బాలుడు శవమై కనిపించాడు. ఏలూరు జిల్లా పులిరాముడుగూడెం గిరిజన సంక్షేమ హాస్టల్‌లో నాలుగో తరగతి చదువుతున్న మైనర్ బాలుడు పాఠశాల ఆవరణలో శవమై కనిపించాడని. అయితే బాలుడి చేతిలో ఓ లేఖ ఇప్పుడు సంచలనం రేపుతుంది. అతని చేతిలో ఇలాంటి హత్యలు మరిన్ని చేస్తామని బెదిరించే లేఖ లభించిందని పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి వచ్చిన ఇద్దరు వ్యక్తులు బాలుడిని హాస్టల్ నుంచి కిడ్నాప్ చేశారని పోలీసులు తెలిపారు తెలుగులో రాసిన లేఖలో.. బ్రతకాలనుకున్న వాళ్లు వెళ్లిపోండి ఎందుకంటే ఇక నుంచి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అని లేఖలో రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడు మృతదేహం మెడ చుట్టూ గాయాలు, కుడి కన్ను దగ్గర చిన్న గీతలు ఉన్నాయని ఏలూరు పోలీసు సూపరింటెండెంట్ డి మేరీ ప్రశాంతి తెలిపారు.
పులిరాముడుగూడెంలోని హాస్టల్ పక్కన ఉన్న పాఠశాల ఆవరణలో ఉదయం 5.30 గంటలకు బాలుడి మృతదేహం లభ్యమైందని తెలిపారు. పోలీసుల విచారణలో బాలుడు 10 మంది విద్యార్థులతో కలిసి వసతి గృహంలో యథావిధిగా నిద్రపోయాడని.. అర్ధరాత్రి సమయంలో మెష్ లేని కిటికీలోంచి ఎవరో హాల్లోకి ప్రవేశించారని, మరొక వ్యక్తి లోపలికి వెళ్లేందుకు తలుపు గొళ్ళెం తెరిచినట్లు ఒక అబ్బాయి గమనించాడని పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరు దుండగులు మైనర్ బాలుడిని తీసుకువెళ్లారు, అయితే ఈ అపహరణను చూసిన విద్యార్థి భయపడ్డాడని.. ఈ సమాచారాన్ని ఎవరికీ వెల్లడించలేదని పోలీసులు తెలిపారు. ఉదయం పాఠశాలలో బాలుడు శవమై కనిపించాడని పోలీసులు తెలపారు. మరణించిన బాలుడి అన్నయ్య కూడా అదే పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడని.. అదే హాస్టల్‌లో ఉంటాడని పోలీసులు తెలిపారు. అయితే బాలుడు కుటుంబసభ్యులు మాత్రం అనుమానితుల పేర్లు వెల్లడించలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బుట్టాయగూడెం పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.