HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >India Unveils First Anti Terror Policy Prahaar Addressing Cyber Threats

ఉగ్రవాదంపై కేంద్రం ఉక్కుపాదం.. కొత్త యాంటీ టెర్రర్ పాలసీ ‘ప్రహార్’ విడుదల!

భారతదేశపు యాంటీ టెర్రర్ పాలసీ ‘ప్రహార్’ ప్రధాన లక్ష్యం నిఘా వర్గాల సమాచారాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుని ఉగ్రదాడులను అడ్డుకోవడం, తక్షణమే తిప్పికొట్టడం.

  • Author : Gopi Date : 24-02-2026 - 4:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Territorial Army Recruitment
Territorial Army Recruitment

PRAHAAR: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సరిహద్దు ఉగ్రవాదం, ఉగ్రవాదుల పట్ల కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినమైన వైఖరిని అవలంబించింది. ఉగ్రవాదంపై ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా ఒక ప్రత్యేక యాంటీ టెర్రర్ పాలసీని విడుదల చేసింది. దీనికి ‘ప్రహార్’ (PRAHAAR) అని పేరు పెట్టారు. ఫిబ్రవరి 23, 2026న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 8 పేజీల ఈ విధాన పత్రాన్ని విడుదల చేస్తూ సంబంధిత విభాగాలు, అధికారులు దీనిని ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది.

ఈ పాలసీ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?

భారతదేశపు యాంటీ టెర్రర్ పాలసీ ‘ప్రహార్’ ప్రధాన లక్ష్యం నిఘా వర్గాల సమాచారాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుని ఉగ్రదాడులను అడ్డుకోవడం, తక్షణమే తిప్పికొట్టడం. సైబర్ దాడులు, డ్రోన్ల దుర్వినియోగం, డార్క్ వెబ్, క్రిమినల్ హ్యాకర్లు, క్రిప్టో వాలెట్లు, ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీ వంటివి ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లకుండా ఆపడం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్, కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ మెటీరియల్స్ ఉగ్రవాదులకు అందకుండా నిరోధించడం.

Also Read: ఇది దేవుడికే చేసిన మహా అపచారం : లడ్డూ కల్తీ వ్యవహారం సీఎం చంద్రబాబు తీవ్ర ఆరోపణలు

ఈ విధానంలో భాగస్వాములు ఎవరు?

‘ప్రహార్’ పాలసీలో భాగంగా పోలీస్, ఆర్మీ, NSG, NIA, RAW, IB విభాగాలతో పాటు డాక్టర్లు, లాయర్లు, సైకాలజిస్టులు మరియు సివిల్ సొసైటీని కూడా అనుసంధానిస్తారు. విదేశీ ఇంటెలిజెన్స్ సంస్థలతో సమన్వయం పెంచుకోవడంపై దృష్టి పెడతారు. అల్-ఖైదా, జైష్-ఎ-మహ్మద్, లష్కరే తాయిబా, ISIS వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల నుండి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి, స్లీపర్ సెల్స్ కార్యకలాపాలను అరికట్టడానికి ఈ ఏజెన్సీలన్నీ కలిసి పనిచేస్తాయి.

ప్రహార్ (PRAHAAR) అంటే ఏమిటి?

P – Prevention (నివారణ): ఉగ్రదాడులు జరగకముందే వాటిని అడ్డుకోవడం. యువత ఆన్‌లైన్ ఉగ్రవాదం వైపు వెళ్లకుండా చూడటం, ఉగ్రవాదులకు నిధులు, ఆయుధాలు అందకుండా చేయడంపై దృష్టి సారిస్తారు.

R – Responses (స్పందన): ఒకవేళ ఉగ్రదాడి జరిగితే అత్యంత వేగంగా స్పందించి తిప్పికొట్టడం. దీనికోసం పోలీస్, NSG, NIA, ఆర్మీ సమన్వయంతో పనిచేస్తాయి.

A – Aggregating (ఏకీకరణ): ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని భద్రతా సంస్థలను ఒకే తాటిపైకి తీసుకురావడం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఏజెన్సీలన్నీ ఒకే రకమైన SOP (ప్రామాణిక విధానం) పాటిస్తాయి.

H – Human Rights and Law (మానవ హక్కులు- చట్టం): ప్రతి చర్య చట్టానికి లోబడి ఉంటుంది. ఉగ్రవాదాన్ని ఏ మతం లేదా కులంతో ముడిపెట్టరు. చర్యల సమయంలో మానవ హక్కులను గౌరవిస్తారు.

A – Attenuating (తగ్గించడం): ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పరిస్థితులను, తీవ్రవాద భావజాలాన్ని మూలాల నుండే నిర్మూలించడం.

A – Aligning (అంతర్జాతీయ సహకారం): ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచ దేశాల సహకారాన్ని తీసుకోవడం. ఇంటెలిజెన్స్ షేరింగ్, FATF వంటి అంతర్జాతీయ సంస్థల సాయంతో ఉగ్రవాదుల ఏరివేత.

R – Resilience (స్థితిస్థాపకత/పునరుద్ధరణ): దాడులు జరిగినప్పుడు సమాజం,వ్యవస్థలు త్వరగా కోలుకునేలా చేయడం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anti-Terror Policy
  • cyber threats
  • Indian army
  • national news
  • PRAHAAR

Related News

    Latest News

    • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

    • Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

    • BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

    • Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

    • TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd