HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Marijuana Packets And Condoms In V2 Spa Center Ongole City

Spa Center : స్పా సెంటర్‌లో క్రాస్ మసాజింగ్.. పెద్దసంఖ్యలో కండోమ్స్, గంజాయి

ఈ స్పా సెంటర్‌‌కు(Spa Center) ఎవరెవరు వెళ్లారు అనే వివరాలను సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

  • Author : Pasha Date : 30-11-2024 - 5:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
V2 Spa Center Ongole Ap

Spa Center : అది పేరుకు మసాజ్ పార్లర్.  కానీ అందులో మహిళలతో పురుషులకు మసాజ్ చేయిస్తూ నిర్వాహకులు అడ్డంగా దొరికిపోయారు. ఆ మసాజ్‌లో గంజాయి ప్యాకెట్లు, కండోమ్‌ల ప్యాకెట్లు కూడా పెద్దసంఖ్యలో దొరికాయి. ఒంగోలు నడిబొడ్డున బండ్లమిట్ట సెంటర్‌లోని పార్వతమ్మ గుడి వద్దనున్న  వీ2 మసాజ్ పార్లర్‌లో జరుగుతున్న ఈ తతంగాన్ని పోలీసులు బయటపెట్టారు. ఈ స్పాలోని సీలింగ్ లైట్లు అమర్చే రంధ్రాలలో 10 గంజాయి ప్యాకెట్లు దొరికాయి. 25 కండోమ్ ప్యాకెట్లు, 10 కండోమ్ బాక్సులను గుర్తించారు. పోలీసులు వస్తున్నారన్న సమాచారం ముందస్తుగా అందడంతో అక్కడున్న యువతులు పరారయ్యారని స్థానికులు అంటున్నారు. దీంతో వీ2 స్పా సెంటర్ నిర్వాహకులపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ స్పా సెంటర్‌‌కు(Spa Center) ఎవరెవరు వెళ్లారు అనే వివరాలను సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

Also Read :Maharashtra New CM : డిసెంబరు 5న కొలువుతీరనున్న ‘మహాయుతి’ సర్కారు.. సీఎంగా ఆయనకే ఛాన్స్!

ఈగల్ రెడీ.. 

  • ఈగల్ అంటే  ‘‘ఎలైట్ యాంటీ- నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్’’.
  • ఇది ఏపీ పోలీస్ శాఖలో ఏర్పాటైన కొత్త వ్యవస్థ.
  • గంజాయి సాగు, మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టడమే దీని పని.
  • దీని ఏర్పాటుపై ఏపీ హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
  • ఈగల్ టీమ్‌కు ఐజీ ఆకే రవికృష్ణ సారథ్యం వహిస్తారు. ఈయన గతంలో గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఎస్పీగా, ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేశారు.
  • ఈగల్ విభాగం కోసం అమరావతిలో రెండు స్టేషన్లు ఉన్నాయి.విశాఖపట్నం, పాడేరు కేంద్రాలుగా మరో రెండు రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ టీమ్‌లను ఏర్పాటు చేశారు.
  • మాదక ద్రవ్యాలపై ఫిర్యాదుల స్వీకరణ కోసం టోల్ ఫ్రీ నంబర్ 1972ను ఏర్పాటు చేశారు. అమరావతిలో ఏర్పాటు చేసిన ఈ కాల్‌ సెంటర్ 24 గంటలపాటు పనిచేస్తుంది.
  • నార్కోటిక్స్ పోలీసు, నార్కోటిక్స్ కంట్రోల్ విభాగాల్లో మొత్తం 450 మంది సిబ్బంది పని చేస్తారు.
  • ప్రధాన కార్యాలయంలో 200 మంది, జిల్లాల్లోని విభాగాల్లో 181 మంది పనిచేస్తారు.
  • ఈ విభాగాల్లో పనిచేసేందుకు పోలీసు సిబ్బందిని డిప్యూటేషన్‌పై తీసుకుంటారు. వారికి  ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తారు.
  • ఈగల్ విభాగంలో పనిచేసే పోలీసు సిబ్బందికి అదనపు ప్రోత్సాహకాలు లభిస్తాయి.

Also Read :Priyanka Gandhi : ‘‘మీకోసం నా ఇల్లు, ఆఫీసు తెరిచే ఉంటాయి’’.. వయనాడ్ ప్రజలతో ప్రియాంకాగాంధీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Condoms
  • crime
  • marijuana
  • ongole
  • Spa Center
  • V2 Beauty Salon
  • V2 Spa Center

Related News

    Latest News

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

    • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd