Priyanka Gandhi : ‘‘మీకోసం నా ఇల్లు, ఆఫీసు తెరిచే ఉంటాయి’’.. వయనాడ్ ప్రజలతో ప్రియాంకాగాంధీ
మీకు బలమైన, మెరుగైన భవిష్యత్తును నిర్మించడానికి అందుబాటులో ఉన్న ప్రతీ వనరును వాడుకుందాం’’ అని ప్రియాంక(Priyanka Gandhi) తెలిపారు.
- Author : Pasha
Date : 30-11-2024 - 3:52 IST
Published By : Hashtagu Telugu Desk
Priyanka Gandhi : లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ప్రియాంకాగాంధీ వయనాడ్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. శనివారం రోజు వయనాడ్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. తనను ఎంపీగా ఎన్నుకున్నందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గ ప్రజల కోసం తన ఇల్లు, ఆఫీసు తలుపులు ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయని ప్రియాంక వెల్లడించారు. ఏ సమస్య వచ్చినా తనను కలవాలని ప్రజలకు సూచించారు. ‘‘మీ నుంచి నేర్చుకోవడానికి, వినడానికి నేను రెడీగా ఉన్నాను. మీ సమస్యల గురించి లోతుగా అర్థం చేసుకోవడానికే నేను సిద్ధంగా ఉన్నాను’’ అని ఆమె తెలిపారు.
Also Read :US Defence Minister : ‘నా కొడుకుకు మహిళలంటే చులకనభావం’.. కాబోయే రక్షణమంత్రిపై తల్లి విమర్శలు
‘‘రాత్రివేళల్లో వయనాడ్‌లోని పలు ప్రాంతాల్లో ప్రజల రాకపోకలపై బ్యాన్ అమల్లో ఉంది. నియోజకవర్గంలోని పలు ఏజెన్సీ ఏరియాల్లో మనుషులపై జంతువుల దాడులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మెరుగైన వైద్య, విద్యా సేవలను ప్రజలు కోరుకుంటున్నారు. ఈ సమస్యలన్నీ నాకు తెలుసు. ఇంకా ఏమైనా సమస్యలున్నా చెప్పండి. వాటి పరిష్కారానికి నా వంతుగా పోరాడుతాను. అవసరమైతే మీ ఇళ్లకు వచ్చి సమస్యలు తెలుసుకుంటాను. నన్ను గెలిపించినందుకు.. మిమ్మల్ని నిరాశపర్చను’’ అని వయనాడ్ ప్రజలకు ప్రియాంక హామీ ఇచ్చారు. ‘‘2019 నుంచి 2024 జూన్ వరకు వయనాడ్‌కు ఎంపీగా నా సోదరుడు రాహుల్ గాంధీ సేవలు అందించారు. ఇప్పుడు ఆయనకు వయనాడ్ ప్రజలు దూరం అవుతున్నారు. నేను కూడా మీ కోసం శాయశక్తులా పనిచేస్తాను. మీకు బలమైన, మెరుగైన భవిష్యత్తును నిర్మించడానికి అందుబాటులో ఉన్న ప్రతీ వనరును వాడుకుందాం’’ అని ప్రియాంక(Priyanka Gandhi) తెలిపారు.
Also Read :Liquor Prices Reduced : మందుబాబులకు గుడ్ న్యూస్.. మూడు మద్యం బ్రాండ్‌ల ధరలు తగ్గింపు
2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్‌బరేలీ స్థానాల నుంచి ఎంపీగా గెలిచారు. అయితే ఆయన రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా కంటిన్యూ కావాలని డిసైడయ్యారు. దీంతో వయనాడ్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఇటీవలే ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ బైపోల్‌లో ప్రియాంకాగాంధీ దాదాపు నాలుగు లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆమెకు మొత్తం 6.22 లక్షల ఓట్లు పోల్ అయ్యాయి. 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీ సాధించిన మెజారిటీ కంటే ఇది చాలా ఎక్కువ.