HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Maneka Gandhi Writes To Chandrababu Stop Animal Sacrifices At Gangamma Jatara

చంద్రబాబుకు మేనకా గాంధీ లేఖ.. గంగమ్మ జాతరలో జంతు బలులు ఆపండి

  • Author : Vamsi Chowdary Korata Date : 06-05-2026 - 9:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ex Union Minister Maneka Gandhi Letter to Chandrababu Naidu
Ex Union Minister Maneka Gandhi Letter to Chandrababu Naidu

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ జంతు సంరక్షకురాలు మేనకా గాంధీ ఒక లేఖ రాశారు. తిరుపతిలో ఈ నెల 18, 19 తేదీల్లో జరగనున్న గంగమ్మ జాతర సందర్భంగా భారీ ఎత్తున జరిగే జంతు బలులను నిరోధించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. గంగమ్మ ఆలయం వద్ద జాతర పేరుతో పెద్ద సంఖ్యలో జంతువులను బలి ఇవ్వనున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఈ హింసను ఆపాలని ఆమె కోరారు.

దేశంలో అనేక రాష్ట్రాలు ఇప్పటికే జంతు బలులను పూర్తిగా నిషేధించాయని మేనకా గాంధీ తన లేఖలో గుర్తుచేశారు. ఏపీకి పొరుగున ఉన్న కర్ణాటకలో కూడా జంతుబలులను నిషేధించి, వాటికి బదులుగా కొబ్బరికాయలు కొట్టేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నారని ఆమె ఉదహరించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు సైతం ఈ విషయంలో కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు.

టెక్నాలజీతో పాటు అనేక విషయాల్లో దేశంలోనే అత్యంత ముందుచూపు ఉన్న ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు ఒకరని ప్రశంసించిన మేనకా గాంధీ, అలాంటి మీరు ఈ జంతుబలులను ఆపడం సాధ్యం కాదా? అని ప్రశ్నించారు. జంతుబలులు సమాజంలో హింసను ప్రేరేపిస్తాయని, ఇది మంచిది కాదని అభిప్రాయపడ్డారు. బలుల కోసం ఆలయాలకు వచ్చేవారు చాలా సందర్భాల్లో మద్యం సేవించి ఉంటారని, ఇది మరిన్ని హింసాత్మక ఘటనలకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

“జాతర పేరుతో జరిగే ఈ మారణకాండను దేశం మొత్తం చూస్తోంది. ఇది దేశంలోనే అత్యంత దారుణమైన సామూహిక హత్యలుగా మారుతున్నాయి. ఏ కారణం లేకుండా వేలాది మూగజీవాలను చంపడం దారుణం” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాల అభివృద్ధికి నిధులు ఇవ్వవచ్చని, జంతుబలులకు బదులుగా కొబ్బరికాయలు సమర్పించేలా భక్తులను చైతన్యపరచాలని సూచించారు. గతంలో కూడా ఎంతోమంది యువకులు, వైద్యులు, ప్రొఫెసర్లు ఈ బలులను ఆపాలని తనకు లేఖలు రాశారని పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని, తక్షణమే జంతుబలులను ఆపేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబును మేనకా గాంధీ కోరారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Andhra Pradesh Festivals
  • animal protection
  • AP CM Chandrababu Naidu
  • Ganga Jatara
  • Maneka Gandhi
  • Tirupati

Related News

DRDO Aircraft Manufacturing Center in Andhra Pradesh

DRDO: ఏపీలో రూ.15,000 కోట్లతో డీఆర్‌డీవో ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ భారీ ప్రాజెక్ట్

ఏపీలో ఏరోస్పేస్, రక్షణ రంగం పరుగులు పెట్టనుంది. రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్ట్ రాబోతోంది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏకంగా రూ.15,000 కోట్ల పెట్టుబడితో ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డీఆర్‌డీవో (రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ) ముందుకు వచ్చింది. ఈ నెల 15న సీఎం చంద్రబాబు ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శంకుస

  • CM Chandrababu Naidu to Visit Pawan Kalyans Residence

    పవన్ ఇంటికి సీఎం చంద్రబాబు

  • Andhra Pradesh

    ఏపీకి మరో భారీ పరిశ్రమ

Latest News

  • Vangalapudi Anita: రాజకీయ నేతలకు రెట్టింపు ఫైన్.. ట్రాఫిక్ చలానాలపై ఏపీ హోంమంత్రి అనిత

  • Shashi Tharoor: మోదీ, షా వ్యూహం భేష్.. మనం ఆత్మపరిశీలన చేసుకోవాలన్న శశి థరూర్

  • AIADMK: తమిళ్ పాలిటిక్స్‎లో బిగ్ ట్విస్ట్.. అన్నాడీఎంకే లో రగడ

  • TVK Keerthana: టీవీకే శివకాశి ఎమ్మెల్యేగా తెలుగు మహిళా కీర్తన

  • Vijay TVK: విజయ్‎తో టచ్‎లో 10 మంది ఎమ్మెల్యేలు..!

Trending News

    • TVK Vijay Trisha: ఎమ్మెల్యేగా త్రిష అక్కడ నుంచే పోటీ..?

    • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd