HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Major Changes In The Bay Of Bengal A Barrage Of Lightning Strikes Expected In The Coming Days

Rain Alert: బంగాళాఖాతం భారీ మార్పులు.. రానున్న రోజుల్లో పిడుగుల వర్షం

  • Author : Vamsi Chowdary Korata Date : 26-06-2026 - 9:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Major changes in the Bay of Bengal... A barrage of lightning strikes expected in the coming days.
Major changes in the Bay of Bengal... A barrage of lightning strikes expected in the coming days.

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇవాళ విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పోలవరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు, శ్రామికులు, పశువుల కాపరులు మరింత అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

మరోవైపు రాష్ట్రంలో వాతావరణ వివరాలను ఐఎండీ వెల్లడించింది. ఇవాళ ఉత్తరాంధ్ర, కోస్తాలోని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల పడే అవకాశముందని చెప్పారు. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయంటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లిలో 5.2 సెంటీమీటర్లు, కృష్ణా జిల్లా గుడివాడలో 3.5, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో 3.5, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో 3.3, ఏలూరు జిల్లా భీమడోలులో 3, ఏలూరు జిల్లా కైకలూరులో 2.9, విజయనగరంలో 2.7, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 2.6, ఎన్టీఆర్ జిల్లా పాలేరు బ్రిడ్జి వద్ద 2.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని ఐఎండీ తెలిపింది.

మరోవైపు శుక్రవారం, శనివారం కోస్తా, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

వానలు పడే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే కొన్ని చోట్ల ఎండ తీవ్రత కూడా కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు కూడా మెల్లిగా విస్తరిస్తున్నాయి. వర్షాలు ఊపందుకుంటాయని భావిస్తున్నారు. అలాగే ఏపీపై ఎల్‌నినో ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. రైతుల్ని ముందుగానే అలర్ట్ చేసి వారికి కొన్ని సూచనలు చేశారు. ఈసారి పంటల సాగు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh rain alert
  • AP Rain Alert
  • Heavy Rain Alert
  • IMD Rain Alert
  • rain alert
  • Rain Alert in Andhra Pradesh
  • rain alert in AP
  • Rain Alert Today

Related News

Rain alert for Telangana; Meteorological Department issues warnings.

Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎండల తీవ్రత నుంచి ఎట్టకేలకు ఉపశమనం లభించింది. గత కొన్ని వారాలుగా భానుడి భగభగలతో, తీవ్రమైన వడగాల్పులతో అల్లాడిపోయిన జనం.. ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులతో ఊపిరి పీల్చుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల క్రితం వరకు ఎండలు దంచుతున్నాయి. చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్‌ను దాటి నమోదు కావడంతో ప్రజలు ఇళ్ల నుండి బ

  • Big alert for the people of AP: Heavy rains in these districts.

    AP Rain Alert: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

  • Heavy rain forecast for several districts in Telangana.

    Rain Alert: తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్షసూచన

  • Heavy rains in AP...

    Rain Alert: ఏపీ భారీ వర్షాలు..

  • Alert for the people of the Telugu states: Heavy rain forecast.

    Weather Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. భారీ వర్ష సూచనా

Latest News

  • Jnaneswari: తుని మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. కుక్క పోస్ట్ మార్టం రిపోర్టులో బయటపడ్డ కీలక విషయాలు

  • Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ లో అమరవీరుల పేర్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది

  • IAS Srilakshmi: ఐఏఎస్ శ్రీలక్ష్మీకి ఏపీ ప్రభుత్వం కీలక పోస్టింగ్..

  • Varahi Ammavaru: వారాహి అమ్మవారి గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

  • Smartphone using: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా? నో డౌట్, స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ అయినట్లే!!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd