HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Big Alert For The People Of Ap Heavy Rains In These Districts

AP Rain Alert: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

  • Author : Vamsi Chowdary Korata Date : 25-06-2026 - 8:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Big alert for the people of AP: Heavy rains in these districts.
Big alert for the people of AP: Heavy rains in these districts.

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలతో పాటుగా ఎండలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఈదురు గాలులతో కూడిన వానలు పడతాయంటున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే మిగతా చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈనెల 26, 27 తేదీల్లో కోస్తా, రాయలసీమలోని జిల్లాల్లో వర్షాలు, అక్కడక్కడా భారీ వానలు పడతాయంటున్నారు. అయితే రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఎండ తీవ్రత ఉంటుందన్నారు. రాష్ట్రంలో శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయంటున్నారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందంటున్నారు. అలాగే వర్షాలు పడే సమయంలో ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందన్నారు.

మరోవైపు బుధవారం రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎండ తీవ్రత, ఉక్కపోత వాతావరణం కొనసాగింది. కొన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. పల్నాడు జిల్లా జంగమహేశ్వరపురంలో 39.5 డిగ్రీలు, తిరుపతిలో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో, తేమగా ఉండటం వల్ల సాయంత్రం ఉత్తరాంధ్రలోని పలు జిల్లాలు, కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వానలు పడ్డాయి.

రాష్ట్రంలో ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించారు. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వర్షం పడే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని, ఆ సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు వంటి వాటి కింద నిలబడొద్దని చెప్పారు. జనాలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. తాజా వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు కూడా విస్తరించనున్నాయి.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh rain alert
  • AP Rain Alert
  • Heavy Rain Alert
  • IMD Rain Alert
  • rain alert
  • Rain Alert in Andhra Pradesh
  • rain alert in AP
  • Rain Alert Today

Related News

Low-pressure area in the Bay of Bengal... extremely heavy rains in these states.

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు

గత కొన్ని రోజులుగా దేశంలో అనేక ప్రాంతాల్లో వానలు తగ్గి ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. మందగించిన నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా మళ్లీ పుంజుకోనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఒక బలమైన వాతావరణ వ్యవస్థ (అల్పపీడన ద్రోణి) కారణంగా ఈ రుతుపవనాలు తిరిగి చురుగ్గా మారేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయని శాస్త్రవేత

  • Low-pressure area in the Bay of Bengal... extremely heavy rains in these states.

    Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక

  • Rain's impact... roads turned into rivers.

    Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Low-pressure area in the Bay of Bengal... extremely heavy rains in these states.

    Rain Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక..

Latest News

  • Ponnam Prabhakar: SIR ప్రక్రియ నత్తనడకన.. గడువు పొడిగించాలని పొన్నం విజ్ఞప్తి

  • Mudragada Padmanabham Funeral: ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం.. అధికారిక లాంఛనాలపై వైసీపీ అభ్యంతరం

  • Samantha: ప్రెగ్నెన్సీ పై సమంత ఎమోషనల్ కామెంట్స్

  • Tummala Nageswara Rao: ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలి: మంత్రి తుమ్మల

  • Deputy CM Bhatti Vikramarka: నవంబర్ 19న ఇందిరమ్మ బీమా ప్రారంభిస్తాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd