HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Heavy Rains In Ap

Rain Alert: ఏపీ భారీ వర్షాలు..

  • Author : Vamsi Chowdary Korata Date : 22-06-2026 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Low-pressure area in the Bay of Bengal... extremely heavy rains in these states.
Low-pressure area in the Bay of Bengal... extremely heavy rains in these states.

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇవాళ మేఘావృతమైన వాతావరణంతో పాటు చెదురుమదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. అలాగే మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని తెలిపారు. పిడుగులు పడే అవకాశం ఉందనే అంచనాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములు, పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడవద్దని.. భారీ హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

ఆదివారం పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌తో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడ్డాయి. మచిలీపట్నం, ఏలూరు, నర్సాపురం, దివిసీమ, గుడివాడ, భీమడోలు పరిసర ప్రాంతాల్లో పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు.. పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిశాయి. అలాగే ఆదివారం పలు జిల్లాల్లో వానలు పడ్డాయి. ఉరుములు, పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడవద్దని ప్రజలను హెచ్చరించింది. భారీ హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించింది.

విద్యుత్ వైర్లు తెగిపడే అవకాశం ఉందని, వాటికి దూరంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రైతులు, కూలీలు, పశువుల కాపరులు పిడుగులు పడే అవకాశం ఉందని.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల వీచ్చే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పిడుగులు పడే అవకాశం ఉందని.. అవసరమైతేనే బయటకు రావాలని, వర్షాల సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలు వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాలు, పిడుగుల పడే సమయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలి అన్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh rain alert
  • AP Rain Alert
  • Heavy Rain Alert
  • heavy rains Andhra Pradesh
  • IMD Rain Alert
  • rain alert

Related News

Low-pressure area in the Bay of Bengal... extremely heavy rains in these states.

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు

గత కొన్ని రోజులుగా దేశంలో అనేక ప్రాంతాల్లో వానలు తగ్గి ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. మందగించిన నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా మళ్లీ పుంజుకోనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఒక బలమైన వాతావరణ వ్యవస్థ (అల్పపీడన ద్రోణి) కారణంగా ఈ రుతుపవనాలు తిరిగి చురుగ్గా మారేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయని శాస్త్రవేత

  • Low-pressure area in the Bay of Bengal... extremely heavy rains in these states.

    Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక

  • Rain's impact... roads turned into rivers.

    Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Low-pressure area in the Bay of Bengal... extremely heavy rains in these states.

    Rain Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక..

Latest News

  • Ponnam Prabhakar: SIR ప్రక్రియ నత్తనడకన.. గడువు పొడిగించాలని పొన్నం విజ్ఞప్తి

  • Mudragada Padmanabham Funeral: ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం.. అధికారిక లాంఛనాలపై వైసీపీ అభ్యంతరం

  • Samantha: ప్రెగ్నెన్సీ పై సమంత ఎమోషనల్ కామెంట్స్

  • Tummala Nageswara Rao: ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలి: మంత్రి తుమ్మల

  • Deputy CM Bhatti Vikramarka: నవంబర్ 19న ఇందిరమ్మ బీమా ప్రారంభిస్తాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd