HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Heavy Rain Forecast For Several Districts In Telangana

Rain Alert: తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్షసూచన

  • Author : Vamsi Chowdary Korata Date : 23-06-2026 - 10:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Heavy rain forecast for Telangana.
Heavy rain forecast for Telangana.

ఎండ తీవ్రతతో, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. గత కొన్ని రోజులుగా మందకొడిగా మారిన నైరుతి రుతుపవనాల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. సోమవారం తెలంగాణ పరిధిలో ఇవి కొంత ముందుకు కదిలాయని.. రానున్న 24 గంటల్లో రాష్ట్రమంతటా ఇవి పూర్తిగా విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాస్తవానికి ఈనెల 8వ తేదీనే నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించినప్పటికీ వాతావరణంలో చోటుచేసుకున్న అనూహ్య మార్పుల కారణంగా వాటి గమనం ఒక్కసారిగా మందగించింది. దీంతో రాష్ట్రంలో రుతుపవనాల విస్తరణ ఆలస్యమైంది. తాజాగా.. రాయలసీమ, తమిళనాడు మీదుగా తెలంగాణ నుంచి మన్నార్ గల్ఫ్ వరకు ఒక ద్రోణి కొనసాగుతుండటంతో రుతుపవనాలు పుంజుకున్నాయి.

ఈ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి మూడ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపారు. మంగళవారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. అలాగే బుధవారం ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వానలు దంచికొట్టనున్నాయి. గురువారం నాటికి వర్షాల తీవ్రత మరింత పెరిగి పైన పేర్కొన్న జిల్లాలతో పాటు పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

మరోవైపు.. హైదరాబాద్‌లో సోమవారం అర్ధరాత్రి దాటాక ప్రారంభమైన వర్షం నేటి (మంగళవారం) ఉదయం వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో జల్లులుగా కురుస్తూనే ఉంది. దీంతో నగరంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి వాతావరణం పూర్తిగా ఆహ్లాదకరంగా మారింది. రానున్న 24 గంటల్లో హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో నగరంలోని పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసేందుకు 50 శాతానికి పైగా అవకాశాలు ఉన్నాయి. వర్షం పడే సమయంలో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున వాహనదారులు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, పాత భవనాల వద్ద ఆగరాదని ట్రాఫిక్ పోలీసులు, వాతావరణ శాఖ సూచించారు.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో అత్యధికంగా 7.9 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. అలాగే జగిత్యాల జిల్లా మేడిపల్లిలో 5.1 సెం.మీ, మంచిర్యాల జిల్లా తాండూర్‌లో 3.8 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. అయితే, ఒకవైపు వర్షాలు పడుతున్నప్పటికీ.. ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లోని కొన్ని మండలాల్లో మాత్రం ఇంకా వడగాలుల ప్రభావం కొనసాగుతుండటం గమనార్హం. రుతుపవనాలు పూర్తిగా విస్తరిస్తేనే రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గి.. రైతులకు విత్తనాలు వేసుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతాయని నిపుణులు చెబుతున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Heavy Rain Alert
  • rain alert
  • Rain Alert Today
  • telangana heavy rain alert
  • Telangana Rain Alert

Related News

Alert for the people of Telangana: Heavy rains in this district.

Rain Alert: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాగల 24 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా అత్యంత భార

  • Alert for the people of Telangana: Heavy rains in this district.

    Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు

  • Heavy rains in AP... Dark clouds gathering.

    Rain Alert: ఏపీలో భారీ వర్షాలు.. కమ్ము కోస్తున్న కారు మబ్బులు

  • Heavy rains in AP... Dark clouds gathering.

    Rain Alert: ప్రజలకు చల్లటి కబురు.. నేడు ఆ జిల్లాల్లో వానలు

  • Heavy rains in AP... Dark clouds gathering.

    Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు

Latest News

  • Komatireddy Raj Gopal Reddy : ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

  • Viral : హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో 20 అడుగుల భారీ కొండ చిలువ

  • Vizag : పవన్ నటన నేర్చుకున్న భవనం కూల్చివేత

  • Salman Khan New Pic : సల్మాన్ కు ఏమైంది..? ఇలా అయ్యాడేంటి ?

  • PV Sindhu Scripts History : కంగ్రాట్స్ చెప్పిన పవన్ కళ్యాణ్‌కు సింధు ఎలాంటి రిప్లయ్ ఇచ్చిందో తెలుసా ?

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd