HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Maharashtra Officials Visit Polavaram Project

Polavaram : పోలవరం ప్రాజెక్టును సందర్శించిన మహారాష్ట్ర అధికారులు

డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, దాని నిర్మాణానికి ఉపయోగించే యంత్రాలు, మెటీరియల్ వివరాలను స్థానిక జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టిసీమ ప్రాజెక్టును సందర్శించారు. అక్కడి పంప్ హౌస్, ఫోర్ బేలను పరిశీలించారు.

  • Author : Latha Suma Date : 19-04-2025 - 9:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Maharashtra officials visit Polavaram project
Maharashtra officials visit Polavaram project

Polavaram: పోలవరం ప్రాజెక్ట్, పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని మహారాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు శనివారం సందర్శించారు. ఈ మేరకు వారు పోలవరం ప్రాజెక్ట్‌లో స్పిల్ వే, స్పిల్ వే గేట్లు, ఫిష్ లేడర్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, డయాఫ్రం వాల్ నిర్మాణ ప్రాంతం, పోలవరం జల విద్యుత్తు కేంద్రాన్ని పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, దాని నిర్మాణానికి ఉపయోగించే యంత్రాలు, మెటీరియల్ వివరాలను స్థానిక జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టిసీమ ప్రాజెక్టును సందర్శించారు. అక్కడి పంప్ హౌస్, ఫోర్ బేలను పరిశీలించారు.

Read Also: Jagan : జగన్‌ తో నడిచినందుకు జైలుకు వెళ్లాల్సిందేనా..?

పోలవరం ప్రాజెక్ట్ ను మహారాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి సంజయ్ బెల్సారే, గోదావరి నది నిర్వహణ ఔరంగాబాద్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ తీర్మన్వర్, జలవనరుల విభాగం పుణె చీఫ్ ఇంజినీర్ హనుమంత్ గుణాలే, సీడీఓ నాసిక్ విభాగం చీఫ్ ఇంజినీర్ ఆశీష్ డియోగడే పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమలను సందర్శించారు. కాగా, జగన్ ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును విస్మరించారు. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలో వచ్చాక పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజి కింద మరో రూ. 6,270 కోట్లు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

2014-19 కాలంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే పోలవరం పనులు 72 శాతం పూర్తికాగా.. నిర్వాసితులకు రూ. 6వేల కోట్లు అందించారు. 2019-24 మధ్య సహాయపునరావాసాన్ని జగన్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కేంద్రం నిధులు ఇస్తేనే మీకు ఇస్తానంటూ జగన్ నిర్వాసితుల సమక్షంలోనే చేతులెత్తేసారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజి కింద మరో రూ. 6,270 కోట్లు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. సాధారణంగా ఏదైనా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అవుతుండగా కాంట్రాక్టర్లకు పూర్తి స్థాయి చెల్లింపులు జరపడంపైనే ప్రభుత్వం దృష్టి సారిస్తుంటుంది.

కాగా, ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 70% పూర్తయింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ప్రకారం, 2027 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టు పూర్తి అయితే 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు, 28.5 లక్షల మందికి తాగునీరు మరియు 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఉంది. ​మహారాష్ట్ర అధికారులు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే రాష్ట్రానికి సాగునీరు, విద్యుత్ మరియు తాగునీరు వంటి వనరులు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.​ ఈ సందర్శన ద్వారా మహారాష్ట్ర అధికారులు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికి, ఇతర రాష్ట్రాలతో సమన్వయాన్ని మెరుగుపరచడానికి, మరియు ప్రాజెక్టు ప్రయోజనాలను సమర్థవంతంగా ఉపయోగించడానికి కృషి చేయాలని సంకల్పించారు.

Read Also: Telangana : ఫ్యాన్సీ నంబర్లతో ఒక్క రోజే రూ.3.71 కోట్ల ఆదాయం

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Diaphragm wall
  • Maharashtra Officials
  • Pattiseema Project
  • polavaram project
  • Technical knowledge

Related News

Chandrababu makes a key announcement regarding the Godavari Pushkarams.

Chandrababu Naidu: గోదావరి పుష్కరాలకు చంద్రబాబు కీలక ప్రకటన..

గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 2014-19 మధ్య కాలంలో తమ ప్రభుత్వం 72% పనులు పూర్తి చేస్తే, గడిచిన ఐదేళ్లలో గత ప్రభుత్వం కేవలం 2% పనులు మాత్రమే చేసి డయాఫ్రమ్ వాల్‌ను గోదావరి పాలు చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులను పరుగులు పెట్టిస్తున్నామని, ప్రాజెక్టును 89 శాతం పూర్తి చేశ

  • CM Chandrababu to visit Polavaram project

    CM Chandrababu: పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం చంద్రబాబు

Latest News

  • Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్

  • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి

  • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

  • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

  • New Voter Registration: కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా..? ఈసీ కొత్త రూల్స్..

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd