HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Rs 3 71 Crore Revenue In A Single Day With Fancy Numbers

Telangana : ఫ్యాన్సీ నంబర్లతో ఒక్క రోజే రూ.3.71 కోట్ల ఆదాయం

ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయానికి శనివారం(ఈరోజు) ఒక్క రోజే రూ.3.71 కోట్ల ఆదాయం వచ్చింది. టీజీ09 ఎఫ్‌ 0001 నంబర్‌ను రూ.7.75 లక్షలకు సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ దక్కించుకున్నారు.

  • Author : Latha Suma Date : 19-04-2025 - 9:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rs. 3.71 crore revenue in a single day with fancy numbers
Rs. 3.71 crore revenue in a single day with fancy numbers

Telangana: తెలంగాణలో ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఖరీదైన కార్లు, బైకులకు ప్రత్యేక నంబర్ల కోసం వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు కూడా లక్షల్లో డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో ఫ్యాన్సీ నంబర్లతో తెలంగాణ రవాణాశాఖకు భారీగా ఆదాయం చేకూరింది. ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయానికి శనివారం(ఈరోజు) ఒక్క రోజే రూ.3.71 కోట్ల ఆదాయం వచ్చింది. టీజీ09 ఎఫ్‌ 0001 నంబర్‌ను రూ.7.75 లక్షలకు సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ దక్కించుకున్నారు. టీజీ09 ఎఫ్‌ 0009 నంబర్‌ను రూ.6.70 లక్షలకు కమలయ్య హై సాఫ్ట్‌ సంస్థ కొనుగోలు చేసింది. టీజీ09 ఎఫ్‌9999 నంబర్‌ను రూ.99,999కు ఇకో డిజైన్‌ స్టూడియో దక్కించుకుంది.

ఖైరతాబాద్‌లో ప్రత్యేక సంఖ్యల వేలం నివేదిక

మొత్తం బిడ్ విలువ – రూ.3,715,645

ఫ్యాన్సీ నెంబర్ – TG 09 F0001
మొత్తం బిడ్ అమౌంట్:- రూ. 775,000

యజమాని పేరు: నందమూరి బాలకృష్ణ

సంఖ్య- TG 09 F 0009
మొత్తం బిడ్ అమౌంట్:- రూ. 670,000

యజమాని పేరు : కమలయ్య్ హైసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్

సంఖ్య- TG 09 E 9999
మొత్తం బిడ్ అమౌంట్ – రూ.99,999

యజమాని పేరు : ఎకో డిజైన్ స్టూడియో

సంఖ్య- TG 09 F 0005
మొత్తం బిడ్ అమౌంట్:- రూ. 149,999

యజమాని పేరు: జెట్టి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్

సంఖ్య- TG 09 F 0007
మొత్తం బిడ్ అమౌంట్:- రూ.137,779

యజమాని పేరు: కె.శ్రీనివాస్ నాయుడు

సంఖ్య- TG 09 F 0019
మొత్తం బిడ్ అమౌంట్:- రూ. 60,000

యజమాని పేరు : నేత్రావతి బ్బు బాలగప్ప శివాలింగప్ప

సంఖ్య- TG 09 F 0099
మొత్తం బిడ్ అమౌంట్:- రూ.475,999

యజమాని పేరు: కాన్‌క్యాప్ ఎలక్ట్రికల్ ప్రైవేట్ లిమిటెడ్

కాగా, ఫ్యాన్సీ నంబర్లను పొందేందుకు ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపై వేలం ప్రక్రియలో పాల్గొనవచ్చు. ఇది పూర్తిగా పారదర్శకంగా నిర్వహించబడుతుంది. రవాణాశాఖ ఆధికారుల ప్రకారం, ప్రజల నుంచి స్పందన అనూహ్యంగా ఉందని వారు తెలిపారు. అత్యధిక ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ రవాణాశాఖ భవిష్యత్తులో మరిన్ని ప్రత్యేక నంబర్లను విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది. త్వరలోనే “గోల్డెన్ సిరీస్” అనే కొత్త కేటగిరీ ప్రారంభించే అవకాశముంది. ఈ విధంగా ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రాష్ట్రానికి ఆదాయం రావడమే కాక, ప్రజల లోని ఆసక్తిని కూడా ఉపయోగించుకోవడం గమనార్హం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Fancy Numbers
  • nandamuri balakrishna
  • Rs. 3.71 crore Income
  • telangana
  • Telangana Transport Department

Related News

Telangana Vehicle Registration

Telangana Transport Department: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లోనే RTO సేవలు

తెలంగాణలోని వాహనదారులకు రాష్ట్ర రవాణా శాఖ భారీ ఊరట కల్పించింది. డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన 17 రకాల సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకొస్తూ ‘ఫేస్‌లెస్’ విధానాన్ని ప్రారంభించింది. ఇకపై చిన్న చిన్న పనుల కోసం ఆర్టీవో కార్యాలయాల చుట్టూ గంటల తరబడి తిరగాల్సిన అవసరం లేదని, ఆధార్ ధ్రువీకరణ ద్వారా ఇంటి నుంచే ఈ సేవలను పొందవచ్చని రవాణా శాఖ కమిషనర్ డాక్టర్ కె. ఇలంబర్తి

  • New Policy on Fee Reimbursement in Telangana

    Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కొత్త పాలసీ!

Latest News

  • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

  • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

  • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

  • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

  • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd