Jagan : జగన్ తో నడిచినందుకు జైలుకు వెళ్లాల్సిందేనా..?
Jagan : వివేకానంద రెడ్డి హత్య కేసు నుండి విజయసాయి రెడ్డి పార్టీ విడిచే స్థితికి రావడం , వైఎస్ విజయమ్మ, షర్మిల, అధికారుల నుంచి వాలంటీర్ల వరకు ప్రతీ ఒక్కరికి ఏదో రకంగా ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి
- By Sudheer Published Date - 09:36 PM, Sat - 19 April 25

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jagan ) నాయకత్వంలో సాగిన ప్రయాణంలో అతని వెంట నడిచిన అనేక మంది నేతలు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు చివరికి ఎవరో ఒక రూపంలో నష్టపోయిన వారిగా మారుతున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసు నుండి విజయసాయి రెడ్డి పార్టీ విడిచే స్థితికి రావడం , వైఎస్ విజయమ్మ, షర్మిల, అధికారుల నుంచి వాలంటీర్ల వరకు ప్రతీ ఒక్కరికి ఏదో రకంగా ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. వైసీపీకి సంబంధించిన కేసులపై అధికార పార్టీల కక్ష సూత్రమేనని చెప్పుకుంటూ ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నం జరుగుతున్నా, సమస్య వేరే కోణంలోనూ ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Drugs Case : దసరా నటుడు అరెస్ట్ తో మరోసారి ఇండస్ట్రీ చిక్కుల్లో పడనుందా ..?
జగన్ ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో ఆయన వెంట ప్రయాణం చేసిన వారు ఎందుకు ఒక్కొక్కరుగా వెనక్కు తగ్గుతున్నారు? వారి సేవలను గుర్తించకుండా పార్టీలో ఉంటే వాడుకోవడం, బయటకు వచ్చాక బురదజల్లడం జగన్ నాయకత్వ లక్షణమా? అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయసాయి రెడ్డి వంటి సన్నిహితుడే పార్టీ వదిలిన తర్వాత తన ప్రయాణంలో జగన్ తనను గౌరవించలేదని, తాను ‘ర్యాంక్ 2’ నుంచి ‘ర్యాంక్ 2000’ కి పడిపోయానని చెప్పడం గమనార్హం. పార్టీకి అత్యంత విధేయంగా ఉండే వారు చివరికి జగన్ చేతనే అవమానాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి దురదృష్టకరం. మరి అసలు సమస్య జగన్ ధోరణిలో ఉందా? లేక పార్టీ వ్యవస్థలో ఉందా? అనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. తల్లి విజయమ్మ, సోదరి షర్మిల వంటి కుటుంబ సభ్యులే జగన్ పై విమర్శలు చేస్తే, పార్టీ కార్యకర్తలు, నేతలు కూడా గట్టున ఎక్కడ ఉండాలో తిరిగి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.