Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం
- By Vamsi Chowdary Korata Published Date - 04:50 PM, Thu - 16 October 25

మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు ప్రధాని మోదీ – జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందారు – శక్తిపీఠం, జ్యోతిర్లింగం ఒకేచోట కొలువైన నేల శ్రీశైలం – బ్రిటిష్ వారిని గజగజలాడించిన ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పుట్టిన పౌరుష గడ్డ – సూపర్ సేవింగ్స్ ప్రారంభం మాత్రమే.. రాబోయే రోజుల్లో మరిన్ని ఉంటాయి – 25 ఏళ్లుగా ప్రజా సేవలో సీఎంగా, ప్రధానిగా మోదీ ఉన్నారు – 21వ శతాబ్దం మోదీకి చెందుతుందనడంలో సందేహం లేదు – సరైన సమయంలో.. దేశానికి సరైన నాయకుడు ప్రధాని మోదీ – మోదీ వంటి నాయకుడిని పొందడం.. దేశం ఎంతో అదృష్టం చేసుకుంది – చాలా మంది ప్రధానులతో పనిచేసినా.. మోదీ వంటి నాయకుడిని చూడలేదు – ఎలాంటి విశ్రాంతి లేకుండా నిరంతరం మోదీ పనిచేస్తూనే ఉన్నారు – 2047 ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుంది – మోదీ సంకల్పంతో 11వ స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరాం – ఆపరేషన్ సిందూర్ మన సైనిక బలం నిరూపించింది – మాటలతో కాదు చేతలతో చూపించే వ్యక్తి.. ప్రధాని మోదీ – జీఎస్టీ తగ్గింపుతో 99 శాతం వస్తువులు 5 శాతంలోపు పరిధిలోకి వచ్చాయి – జీఎస్టీ సంస్కరణలతో బచత్ ఉత్సవ్.. భరోసా ఉత్సవ్‌గా మారింది – డబుల్ ఇంజిన్ సర్కారుతో రాష్ట్రానికి డబుల్ బెనిఫిట్ వచ్చింది : సీఎం చంద్రబాబు