YSRCP: వైపీసీ మాజీ మంత్రికి షాకుల మీద షాకులు.. మళ్లీ కస్టడీకి
YSRCP: ఈ కేసులో ఇప్పటికే ఆయనపై కేసు నమోదు కాగా, మరింత లోతుగా విచారణ అవసరమని భావించిన పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.
- By Kavya Krishna Published Date - 11:47 AM, Mon - 30 June 25
YSRCP: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని అక్రమ టోల్ గేట్ కేసులో పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆయనపై కేసు నమోదు కాగా, మరింత లోతుగా విచారణ అవసరమని భావించిన పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఈ పిటిషన్‌ను పరిశీలించి అనుమతి మంజూరు చేసింది.
ఈ మేరకు మంగళవారం ఉదయం నుంచి నెల్లూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ఆయనను విచారించనున్నారు. అవసరమైన ఏర్పాట్లను పోలీసులు ఇప్పటికే పూర్తి చేశారు. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులో కూడా గతంలో కాకాణిని కస్టడీకి తీసుకుని విచారించిన విషయం తెలిసిందే. తాజా టోల్ గేట్ కేసులో కొత్త ఆధారాలు వెలుగులోకి రావచ్చన్న కోణంలో విచారణ ముమ్మరంగా సాగనుంది.
AP News : కారులో డెడ్ బాడీల కలకలం