Jr NTR: మామయ్యకు జూనియర్ ఎన్టీఆర్ విషెస్
- Author : Vamsi Chowdary Korata
Date : 20-04-2026 - 11:58 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తన 76వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ వంటి రాజకీయ దిగ్గజాలతో పాటు సామాన్యుల వరకు అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తన మామయ్య పుట్టినరోజు సందర్భంగా, జూనియర్ ఎన్టీఆర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మావయ్య గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. రాష్ట్ర ప్రజలకు ఇదే విధమైన అంకితభావంతో, దార్శనికతతో సేవ చేయడానికి కావలసిన శక్తిని ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.”
Many happy returns of the day to the Honourable Chief Minister of Andhra Pradesh, Sri @NCBN Mavayya garu. Wishing you continued good health, happiness, and the strength to lead and serve our people with the same dedication and vision. May your leadership continue to inspire…
— Jr NTR (@tarak9999) April 20, 2026