Elections : ఓటర్లకు జయప్రకాశ్ నారాయణ్ విజ్ఞప్తి
ఇంట్లో కూర్చోకుండా పోలింగ్ బూత్ వరకు వెళ్లి ఓటేసి రావాలని, అది మనందరి బాధ్యతని తెలిపారు. ఇక, ఎవరికి ఓటేయాలనే సందేహంపై వివరణ ఇస్తూ.. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నాయని, అంతా అలాగే తయారయ్యాక ఓటెవరికి వేయాలి, ఎందుకు వేయాలనే నిరాశ వద్దని హితవు పలికారు
- Author : Sudheer
Date : 11-05-2024 - 2:09 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో మరికొద్ది గంటల్లో పోలింగ్ మొదలుకాబోతుంది..ఈసారి ఎన్నికలు నువ్వా నేనా అనే రేంజ్ లో కూటమి vs వైసీపీ మధ్య హోరు జరుగుతుంది. ఇరు పార్టీల అభ్యర్థులు తమ గెలుపు ఫై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓట్ హక్కును వినియోగించుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడెక్కోడో ఉన్న వారంతా సొంతర్లకు వస్తున్నారు. హైదరాబాద్ సగం ఖాళీ అయ్యింది. ఈ తరుణంలో ఆయా పార్టీల అధినేతలే కాదు మిగతా రాజకీయ విశ్లేషకులు సైతం ఓటు హక్కు గురించి , ఎవరికీ వేస్తే బాగుంటుందో తెలియజేస్తూ వస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ (Jaya Prakash Narayana) ఓటర్లకు కీలక సూచనా తెలియజేసారు. ఈ నెల 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఇంట్లో కూర్చోకుండా పోలింగ్ బూత్ వరకు వెళ్లి ఓటేసి రావాలని, అది మనందరి బాధ్యతని తెలిపారు. ఇక, ఎవరికి ఓటేయాలనే సందేహంపై వివరణ ఇస్తూ.. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నాయని, అంతా అలాగే తయారయ్యాక ఓటెవరికి వేయాలి, ఎందుకు వేయాలనే నిరాశ వద్దని హితవు పలికారు. ఉన్నంతలో మంచి నాయకుడిని ఎంచుకోవాలని సూచించారు. మంచి నాయకుడంటే.. తాత్కాలిక తాయిలాలకన్నా, సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచేందుకే ఎక్కువ మొగ్గు చూపే వారు కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఆలోచించే వారని వివరించారు. మౌలిక సదుపాయాల కల్పన, ఆదాయ సృష్టికి అనువైన చర్యలు చేపట్టే వారికి మద్దతివ్వాలని ,అలాంటి నాయకుడిని ఎంచుకుని ఓటేసి గెలిపించాలని తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూచించారు.
Read Also : Allu Arjun : పవన్‌కి ఒక ట్వీట్ పడేసి.. వైసీపీకి ప్రచారం చేస్తున్న బన్నీ.. జనసైనికుల విమర్శలు..