Pawan : క్లీన్ స్వీపే లక్ష్యంగా జనసేన ప్రణాళిక..
- By Sudheer Published Date - 01:18 PM, Sun - 11 February 24

గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన జనసేన..ఈసారి భారీ విజయం సాధించాలని చూస్తుంది. ఈ క్రమంలో టీడీపీ తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగబోతుంది. పార్టీకి పట్టున్న స్థానాల్లోనే బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యింది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో క్లీన్ స్వీపే లక్ష్యమని జనసేన పార్టీ ట్వీట్ చేసింది.
పవన్ కళ్యాణ్ సైతం ఏపీ ఎన్నికలకు క్యాడర్ ను సిద్ధం చేస్తున్నారు. పొత్తులో భాగంగా ఆయన టీడీపీ, బీజేపీతో కలసి పోటీ చేయడం ఖాయం కావడంతో ఓట్ల బదిలీకి ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్నికల వేళ తన అభిమానులతో పాటు పార్టీ కార్యకర్తలు, కాపు ఓటర్ల ఓట్లు ప్రతర్థి పార్టీ వైపునకు మరలకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా వరసగా తొలుత జిల్లాలను పర్యటించి క్యాడర్ తో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. సీఎం అన్న సౌండ్ వినపడకుండా చేసేందుకు ఆయన తొలి దశలో చర్యలు తీసుకోనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ నెల 14 నుంచి పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తారని తెలిపింది. మూడు దశల్లో ఎన్నికల ప్రచారం ఉంటుందని పేర్కొంది. మొదటి దశలో నాయకులతో సమావేశాలు, రెండో దశలో స్థానిక కార్యకర్తలతో సమావేశాలు, మూడో దశలో ఎన్నికల ప్రచారం, బహిరంగ సభలు ఉంటాయని వివరించింది. పవన్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించాలన్న డిమాండ్ పెద్దగా వినిపిస్తున్న నేపథ్యంలో పవన్ పర్యటనలు ప్రాధాన్యతలు సంతరించుకున్నాయి.
Read Also : Rakul Preet Singh: కెరీర్లో తొలిసారి అలాంటి పాత్రలో కనిపించనున్న హీరోయిన్ రకుల్?