Jagan Fake : జగన్ ఫేక్ డ్రామా బెడిసికొట్టింది – లోకేశ్
Jagan Fake : చిత్తూరు జిల్లాలో అంబేడ్కర్ విగ్రహం ఘటనను రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం విఫలమైందని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్రంగా విమర్శించారు. సోషల్ మీడియాలో ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది
- By Sudheer Published Date - 10:53 AM, Wed - 8 October 25

చిత్తూరు జిల్లాలో అంబేడ్కర్ విగ్రహం ఘటనను రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం విఫలమైందని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్రంగా విమర్శించారు. సోషల్ మీడియాలో ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. “శాంతిభద్రతలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో జగన్ ఆడిన ఫేక్ డ్రామా చివరికి బెడిసికొట్టింది” అని లోకేశ్ పేర్కొన్నారు. చిత్తూరులో అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారంటూ అబద్దాల కథను నెరిపేందుకు YCP అండ్ కో కుట్ర పన్నిందని, కానీ పోలీసులు ఆ కుట్రను బట్టబయలు చేశారని ఆయన తెలిపారు.
లోకేశ్ తన ట్వీట్‌లో పోలీసులు మాట్లాడిన వీడియోను కూడా పోస్ట్ చేశారు. అందులో పోలీసులు ఘటనకు సంబంధించిన వాస్తవాలను వివరించగా, ఎటువంటి విగ్రహ దహనం జరగలేదని స్పష్టం చేశారు. ఈ వీడియోతో YCP నాయకులు సృష్టించిన అబద్దాలు బయటపడినట్లు లోకేశ్ పేర్కొన్నారు. “ప్రజల్లో భయం, అసహనం కలిగించడం జగన్ రాజకీయ వ్యూహంగా మారింది. ప్రభుత్వంపై విషం చిమ్మడమే ఆయనకు తెలిసిన పని” అని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన మాటల్లో, “ప్రజలు మిమ్మల్ని తిరస్కరించడంతో ఇప్పుడు నకిలీ సంఘటనల ద్వారా అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు” అని అన్నారు.
అలాగే మరో ట్వీట్ లో ప్రజా ప్రభుత్వ పాలన, ఇక్కడ అబద్ధాలు, ఆటలు సాగవు ఆయన హెచ్చరించారు, రాష్ట్రంలో శాంతిభద్రతలను భంగం కలిగించే ప్రయత్నం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని. ప్రభుత్వం పారదర్శకత, న్యాయపరమైన పాలనకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ సంఘటనపై ప్రజల్లో కలకలం రేపే ప్రయత్నం చేసిన YCP నేతల చర్యలను రాజకీయ విశ్లేషకులు కూడా తప్పుపడుతున్నారు. మొత్తానికి, చిత్తూరులో అంబేడ్కర్ విగ్రహం ఘటనను చుట్టూ పుట్టిన ఫేక్ కథనం లోకేశ్ ట్వీట్‌తో బూమరాంగ్ అయిందని చెప్పవచ్చు.