White Hair: తెల్లజుట్టు కారణంగా బయటకు వెళ్లలేకపోతున్నారా.. ఈ సూపర్ చిట్కాలతో జుట్టు నల్లగా మారిపోవడం ఖాయం!
White Hair: తెల్ల జుట్టు కారణంగా ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను పాటిస్తే జుట్టు సహజంగానే నల్లగా మారుతుందని చెబుతున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:00 AM, Wed - 8 October 25

White Hair: ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. 11 ఏళ్ళ పిల్లాడి నుంచే ఈ తెల్ల జుట్టు సమస్య మొదలవుతోంది. అయితే తెల్ల జుట్టును కవర్ చేసుకోవడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ కలర్స్ ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని కొన్ను సార్లు చిన్న వయసులోనే జుట్టు మొత్తం తెల్లగా అయిపోయి బయటకు వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాకుండా చిన్న ఏజ్ లోనే పెద్దవారీలా కనిపిస్తూ ఉంటారు. హెయిర్ కలర్ వేసిన అది కేవలం తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తూ ఉంటుంది.
కానీ ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కాలను పాటిస్తే జుట్టు సహజంగానే నల్లగా మారుతుందని చెబుతున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రతీ రోజూ ఉసిరి నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు నెరసిపోకుండా ఉంటుందట. ఉసిరిలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లకు పోషణనిచ్చి సహజంగా నల్లగా చేస్తాయట. అలాగే ఉల్లిపాయ రసం జుట్టుకు బలాన్ని చేకూరుస్తుందట. రంగును కూడా పునరుద్ధరిస్తుందని చెబుతున్నారు. ఉల్లిపాయలలోని ఎంజైమ్ కాటలేజ్ తెల్ల జుట్టుకు కారణమైన హైడ్రోజన్ పెరాక్స్డ్ ను విచ్ఛిన్నం చేస్తుందట.
కాబట్టి వారానికి 2 సార్లు ఉల్లిపాయ రసాన్ని తలపై పట్టించి 30 నిమిషాల తర్వాత షాంపూతో వాష్ చేసుకోవాలట. కరివేపాకులో కొబ్బరి నూనెను వేసుకుని పెట్టుకోవడమే. కరివేపాకులో మెలానిన్ ఉత్పత్తిని పెంచే శక్తి ఉంది. ఇది జుట్టుకు సహజమైన రంగును అందిస్తుందట. కరివేపాకును కొబ్బరి నూనెలో మరిగించి చల్లార్చి తలకి అప్లై చేసుకోవాలట. ఇలా తరచుగా చేస్తూ ఉండడం వల్ల జుట్టు సహజంగానే నల్లగా మారుతుందట. మెరిసే, బలమైన జుట్టు కోసం మెంతి,పెరుగు బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు. మెంతులు జుట్టు కుదుళ్లకు పోషణ ఇస్తుందట. పెరుగు తేమను అందిస్తుందని, రెండింటినీ కలిపి హెయిర్ ప్యాక్ చేసుకుని వారానికి ఒకసారి వేసుకుంటే మంచిదని చెబుతున్నారు. బ్లాక్ టీలో టానిన్ అనే మూలకం ఉంటుందట. ఇది జుట్టుకు నల్ల రంగును ఇస్తుందట. 2 టీస్పూన్ల టీ పొడిని మరిగించి చల్లార్చి 1 గంట తర్వాత కడిగేయాలట. క్రమం తప్పకుండా వాడటం వల్ల మార్పు కనిపిస్తుందని చెబుతున్నారు. భృంగరాజ్ ను క్రమం తప్పకుండా వాడటం వల్ల తెల్ల జుట్టు తగ్గడమే కాకుండా కొత్త జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుందట. కొద్దిగా గోరువెచ్చగా చేసి తలపై మసాజ్ చేయాలట.