HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagan Tour Accident Video Original Says Fsl

YS Jagan : సింగయ్య పడింది జగన్ కారు కిందే.. ఫోరెన్సిక్ నివేదిక

YS Jagan : పల్నాడు జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న రోడ్ యాక్సిడెంట్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

  • By Kavya Krishna Published Date - 11:31 AM, Sun - 29 June 25
  • daily-hunt
Jagan Tour Accident
Jagan Tour Accident

YS Jagan : పల్నాడు జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న రోడ్ యాక్సిడెంట్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సింగయ్య అనే వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే. ఘటనకు సంబంధించిన వీడియోపై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) తన నివేదికను పోలీసులకు అందజేసింది. ఆ వీడియో అసలైనదేనని, ఎలాంటి మార్ఫింగ్ జరగలేదని నివేదికలో తేలిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

జగన్ ప్రయాణిస్తున్న కారు ముందు సింగయ్య నలిగిపోతున్న దృశ్యం ఒక సెల్‌ఫోన్‌ కెమెరాలో రికార్డై, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ వీడియో నకిలీదని, మార్ఫింగ్ చేసి జగన్‌ను ఇరికించేందుకు కుట్ర చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులు సెల్‌ఫోన్ వీడియోతో పాటు డ్రోన్ ఫుటేజీని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. వీడియో తీసిన ఫోన్‌ ID, లొకేషన్, టైమ్‌స్టాంప్ తదితర సాంకేతిక వివరాలపై విశ్లేషణ చేసిన నిపుణులు, ఆ వీడియోలో ఎటువంటి ఎడిటింగ్ జరగలేదని స్పష్టం చేశారు.

ఇక ఈ కేసులో జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలంటూ ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జూలై 1న హైకోర్టులో విచారణ జరగనుంది. అదే రోజున ఫోరెన్సిక్ నివేదికను కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. ఇప్పటికే అడ్వకేట్ జనరల్ ప్రాథమిక నివేదికను కోర్టుకు సమర్పించగా, పూర్తి ఆధారాలు ఇవ్వడానికి గడువు కోరగా కోర్టు అంగీకరించింది.

ఈ కేసులో గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు విచారణను గంభీరంగా కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పరిశీలించి, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ను సేకరించారు. దాదాపు 10 మంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు కూడా నమోదు చేశారు. ఈ కేసులో జగన్‌తో పాటు డ్రైవర్ రమణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనీ తదితరులపై నిందితులుగా కేసు నమోదు చేశారు.

అయితే, ప్రధాన నిందితుడిగా ఉన్న డ్రైవర్ – ఏఆర్ కానిస్టేబుల్ రమణారెడ్డి విచారణకు పూర్తిగా సహకరించడంలేదని సమాచారం. ప్రమాద సమయంలో కారు బానెట్‌పై ఓ కార్యకర్త ఉండడంతో ఏమి కనిపించలేదని, సింగయ్య చక్రాల కింద పడ్డ విషయం తనకు తెలియదని వాదిస్తున్నట్టు తెలుస్తోంది. అయినప్పటికీ, వీడియోలో స్థానికుల హెచ్చరికల తర్వాత కారును వెనక్కి తీసిన దృశ్యాలు ఉన్నప్పటికీ, డ్రైవర్ తన మాటల్ని మార్చుకోలేదని అధికారులు అంటున్నారు. ఈ కేసు ఫోరెన్సిక్ నివేదికతో కీలక మలుపు తిరగగా, జూలై 1న హైకోర్టు విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.

Stampede: మ‌రో తొక్కిస‌లాట‌.. ముగ్గురు భ‌క్తులు మృతి, 50 మందికి గాయాలు.. వీడియో ఇదే!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • Forensic Report
  • FSL video analysis
  • Jagan tour accident
  • Palnadu Incident
  • road accident investigation
  • Singuayya death
  • ys jagan

Related News

    Latest News

    • Australia Series: ఆసీస్‌తో వ‌న్డే సిరీస్‌.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?!

    • Telangana Bandh : రేపటి బంద్ లో అందరూ పాల్గొనాలి – భట్టి

    • Sweet Cost : ఈ స్వీట్ KGకి రూ.1.11లక్షలు

    • Rahul Gandhi : రాహుల్ గాంధీపై అమెరికన్ సింగర్ సెటైర్లు

    • Deputy CM Bhatti Vikramarka Mallu : ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పీచ్..!

    Trending News

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

      • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

      • Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

      • Bigg Boss : దివ్వెల నోటికి రీతూ బ్రేకులు..!

      • IT Employees : ఐటీ ఉద్యోగులకు మంచి రోజులు.. HCL సహా ఈ కంపెనీలో పెరిగిన ఎంప్లాయీస్..!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd