HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagan Sleeps From Ugadi 3 Days In A Week In The Countryside

Jagan Village Tour: ఉగాది నుంచి జగన్ నిద్ర! వారంలో 3 రోజులు పల్లెల్లో..!!

ప్రజా దర్భార్, రచ్చబండ ఇక జగన్మోహన్ రెడ్డి జాబితాలో లేనట్టే.

  • Author : CS Rao Date : 27-02-2023 - 4:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan Sleeps From Ugadi! 3 Days In A Week In The Countryside..!!
Jagan Sleeps From Ugadi! 3 Days In A Week In The Countryside..!!

ప్రజా దర్భార్, రచ్చబండ ఇక జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) జాబితాలో లేనట్టే. తాజాగా పల్లె నిద్ర ప్రోగ్రామ్ డిజైన్ దిశగా తాడేపల్లి వర్గాలు ఆలోచిస్తున్నాయి. ఆ మేరకు జగన్ సంకేతాలు ఇచ్చారట. వైఎస్ జగన్ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరగనుంది. తెలుగు కొత్త సంవత్సరం ఉగాది నుంచి ప్రతివారం మూడురోజులపాటు పల్లె లో నిద్రించాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. గ‌డ‌ప‌ దాటడంలేదు అనేవారికి పల్లెనిద్ర ద్వారా జగన్ (Jagan) షాక్ ఇవ్వనున్నారు. పల్లె నిద్ర వల్ల ఆయా గ్రామాల్లోని సమస్యలు కూడా పరిష్కారమవుతాయని ఆయన భావిస్తున్నారు. ఎన్నికలనే లక్ష్యంగా నిర్ధేశించుకొని జగన్ ముందుకు వెళుతున్నారు.

తాజాగా గృహ‌సార‌థులు అనే కాన్సెప్టును తీసుకువ‌వచ్చిన సంగతి తెలిసిందే. మార్చిలో ఉగాది రోజు నుంచి వీరు కూడా ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు చేరువవుతారు. ముఖ్యమంత్రి తాడేపల్లి దాటి బయటకు రావడంలేదు అనే విమర్శలకు సమాధానమిస్తూ ఆయన పల్లెనిద్ర పేరుతో కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. నాయకులకు, అధికారులకు పరిమితమైన పల్లెనిద్రను ఇకనుంచి జగన్ (Jagan) కూడా చేయబోతున్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా తనకు అనుకూలంగా వ్యవహారాలు నడుపుతున్నారనే విమర్శలు వచ్చినప్పటికీ పట్టించుకోలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం నెరవేరడమే ఆశయంగా ఆయన పనితీరు ఉంది.

మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు ప్రభుత్వాధికారులు కూడా ఇందులో భాగస్వాములయ్యారు. నియోజకవర్గాల్లో నాయకులందరి జాతకాలపై సర్వేలు చేయించి వివరాలు సేకరించారు. గ్రాఫ్ తగ్గిన ప్రజాప్రతినిధులకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీచేస్తున్నారు. గెలుపు గుర్రాలకు టికెట్లు ఇస్తానని ముందే చెప్పేస్తున్నారు. వైనాట్ 175 అంటూ నాయకులను ప్రశ్నిస్తున్నారు. అందరూ సరిగా పనిచేస్తే అన్ని నియోజకవర్గాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని జగన్ చెబుతున్నారు. అందుకు అనుగుణంగా నియోజకవర్గం ముఖం చూడని ఎమ్మెల్యేలను కూడా గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రయత్నం ఫలించక పోవటంతో నేరుగా రంగంలోకి దిగుతున్నారు. పల్లె నిద్ర ద్వారా ప్రజలకు చేరువ కావాలని బ్లూ ప్రింట్ సిద్ధం చేశారు.

Also Read:  Lokesh Galam: రాయలసీమ ద్రోహి జగన్ : లోకేష్ గళం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 3 days
  • amaravati
  • andhra pradesh
  • ap
  • Countryside
  • jagan
  • politics
  • Sleeps
  • ugadi
  • village
  • week

Related News

Complaint filed against actor Prakash Raj at the police station.

Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూ సమాజాన్ని కించపరిచేలా, కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ కదిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేసినట్లు బీజేపీ నేతలు తెలిపారు. ఈ మేరకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విష్ణువర్ధన

  • Vip Break Darshan For 116 Y

    TTD : 116 ఏళ్ల భక్తికి టీటీడీ గౌరవం .. నవనీతమ్మకు వీఐపీ బ్రేక్ దర్శనం : బీఆర్‌ నాయుడు

  • Big shock for YouTuber Ravan

    YouTuber Ravan : యూట్యూబర్‌ రావణ్‌పై ‘ఉపా’ చట్టం కింద కేసు నమోదు

  • Tender coconut claims a life

    ప్రాణం తీసిన కొబ్బరి బొండం

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd