Jagan : కళ్లు మూసుకుంటే ఐదేళ్లు పూర్తి .. నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు – జగన్
‘ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాం.. ఈ ఎన్నికల్లో ఏమైందో తెలియదు.. కళ్లు మూసుకుంటే ఐదేళ్లు అయిపోయాయి.. మళ్లీ 2024 నుంచి 2029 వరకు కళ్లు మూసుకుంటే ఎన్నికలు వచ్చేస్తాయి'
- By Sudheer Published Date - 10:55 PM, Thu - 13 June 24

‘ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాం.. ఈ ఎన్నికల్లో ఏమైందో తెలియదు.. కళ్లు మూసుకుంటే ఐదేళ్లు అయిపోయాయి.. మళ్లీ 2024 నుంచి 2029 వరకు కళ్లు మూసుకుంటే ఎన్నికలు వచ్చేస్తాయి.. ఎవ్వరు నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు’ ఈ మాటలు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఈరోజు క్యాంపు ఆఫీస్ లో అన్నమాటలు. వై నాట్ 175 అంటూ ఎన్నికల్లోకి దిగిన వైసీపీ..కూటమి దెబ్బకు కోలుకోలేకపోయింది. 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన పార్టీ ..కేవలం 11 సీట్లకు పరిమితం అయ్యింది. ఇంత ఘోరంగా ఓటమి చెందుతుందని ఎవ్వరు ఊహించలేదు. ఈ పరాజయం తర్వాత జగన్ ఒకిత్త కన్నీరు కూడా పెట్టె స్థితికి వచ్చారు. ప్రస్తుతం ఈ ఓటమి నుండి మెల్లగా బయటకు వచ్చేందుకు ట్రై చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ ఫలితాలు చూసి మీరు నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. గడచిన ఐదేళ్ల కాలంలో గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఏకంగా 99శాతం వాగ్దానాలు అమలు చేశాం అని చెప్పుకొచ్చారు. ‘ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాం.. ఈ ఎన్నికల్లో ఏమైందో తెలియదు.. కళ్లు మూసుకుంటే ఐదేళ్లు అయిపోయాయి.. మళ్లీ 2024 నుంచి 2029 వరకు కళ్లు మూసుకుంటే ఎన్నికలు వచ్చేస్తాయి.. ఇప్పటి వరకూ సినిమాలో ఫస్ట్ ఆఫ్ మాత్రమే అయింది అని పేర్కొన్నారు.
ఈ మాటలు విన్న నేతలే కాదు సోషల్ మీడియా లో నెటిజన్లు కూడా సెటైర్లు వేస్తున్నారు. అలా కళ్లు మూసుకుని ఐదేళ్లు గడపబట్టే, పాలన లేక ఆంధ్రప్రదేశ్ మటాష్ అయిపోయింది’, ‘మేమూ అదే చెప్పాం సర్.. మీరు ఇక కళ్లు మూసుకుని ప్రశాంతంగా పడుకోండి’, ఎందుకు ఓడిపోయామో కళ్లు తెరిచి బూతులు మాట్లాడకుండా పోరాటం చేయండి’, ‘ఐప్యాక్ స్క్రిప్ట్ లేకపోతే మాటలు ఇలాగే ఉంటాయి’, ‘కళ్లు మూసుకుంటేనే మీకు 11 సీట్లు వచ్చాయి’,‘2049 వరకూ కళ్లు మూసుకుని ఉండాలి’ అంటూ కామెంట్స్ వేస్తున్నారు.
Read Also : Pawan Kalyan: బొకేలు, శాలువాలు వద్దు.. మంత్రి పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్