Jagan Govt Good News : ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ వరాల జల్లు..
ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అలాగే, ప్రభుత్వ ఉద్యోగి విరమణ సమయానికి సొంత ఇంటి స్థలం ఉండేలా నిర్ణయం తీసుకుంది
- By Sudheer Published Date - 02:16 PM, Wed - 20 September 23

ఎట్టకేలకు సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు (jagan government says good news for government employees) కురిపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలన్నీ వన్ సైడ్ గా మారుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) తో యావత్ తెలుగు ప్రజానీకం జగన్ ఫై విమర్శలు చేస్తుంది.. రాబోయే ఎన్నికల్లో జగన్ సర్కార్ తడిగుడ్డ వేసుకోవాల్సిందే అని అంత మాట్లాడుకుంటున్నారు..దీంతో ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునే పనిలో పడింది జగన్ సర్కార్. అందులో భాగంగా తాజాగా ఉద్యోగులపై వరాల జల్లు కురిపించి కాస్త శాంతిప చేసాడు.
అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Sessions) జరగనున్న ఈ క్రమంలో నేడు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రివర్గం కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల (Government Employees) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అలాగే, ప్రభుత్వ ఉద్యోగి విరమణ సమయానికి సొంత ఇంటి స్థలం ఉండేలా నిర్ణయం తీసుకుంది. అంటే.. ఉద్యోగి రిటైర్ అయిన సమయానికి సొంత ఇంటి స్థలం లేకపోతే.. అలాంటి వారికి ఖచ్చితంగా ఇంటిస్థలాన్ని ప్రభుత్వం కేటాయించనుంది. ఇది ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు సీఎం జగన్. రిటైర్డ్ ఉద్యోగుల పిల్లులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే రిటైర్డ్ ఉద్యోగులు, వారి పిల్లలకు కూడా ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అలాగే ఈ సమావేశంలో 49 అంశాలపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో మరో పథకం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చనున్నారు. యూపీఎస్సీలో ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికి రూ.50 వేల నుంచి లక్ష రూపాయల ఆర్థికసాయం అందించనున్నట్టు సమాచారం..
ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లుపై, జగనన్న ఆరోగ్య సురక్షపై మంత్రిమండలి సమావేశంలో చర్చ జరగనుంది. కురుపాం ఇంజినీరింగ్ కాలేజీల్లో 50 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించి ప్రతిపాదనపై కేబినెట్‌లో చర్చించనున్నారు. ఏపీ ఆధార్ సవరణ బిల్లు, పోలవరం ముంపు బాధితులకు 8,424 ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. అసైన్డ్ భూముల క్రమబద్దీకరణకు, పీవోటీ చట్ట సవరణకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లుపై, దేవాదాయ చట్ట సవరణపై కేబినెట్‌లో చర్చించనున్నారు.