BJP Alliance With Janasena-TDP : జనసేన – టిడిపి కూటమి తో బిజెపి పొత్తు ఉందా..?
- By Sudheer Published Date - 02:24 PM, Sun - 25 February 24

మరో 20 రోజుల్లో ఏపీ (AP)లో అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections 2024) సంబదించిన నోటిఫికేషన్ రానుంది. ఈ క్రమంలో బిజెపి (BJP) పార్టీ ఇంకా సైలెంట్ గా ఉండడం అందరిలో అనేక అనుమానాలకు తావిస్తోంది. కొద్దీ రోజులుగా టీడీపీ – జనసేన (Janasena-TDP) కూటమి తో బిజెపి పొత్తు పెట్టుకుంటున్నట్లు వార్తలు ప్రచారం అవుతూ వస్తుండడం తో అంత నిజమే కావొచ్చు అని అనుకున్నారు. కానీ నిన్న చంద్రబాబు ఏకంగా 118 సీట్లకు సంబదించిన మొదటి జాబితాను విడుదల చేసారు. ఇందులో 94 స్థానాల్లో టీడీపీ , 24 స్థానాల్లో జనసేన పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ ఎక్కడ కూడా బిజెపి తో పొత్తు విషయం కానీ , బిజెపి నేతలు మిగతా చోట్ల పోటీ చేస్తారని కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. పవన్ కళ్యాణ్ సైతం బిజెపి గురించి ఓ మాట కూడా చెప్పలేదు. ఇటు బిజెపి సైతం ఈ జాబితా తర్వాత ఎలాంటి ప్రకటన చేయలేదు.
We’re now on WhatsApp. Click to Join.
దీంతో అసలు బిజెపి పొత్తు పెట్టుకుందా లేదా అని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. పొత్తులపై బీజేపీ హైకమాండ్‌దే తుది నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి చెపుతుంటే..బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులపై తాను చాలా కృషి చేశానని జనసేన అధినేత పవన్ చెప్పుకొచ్చారు. కానీ బీజేపీతో కాకుండా టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను (TDP-Janasena First List) విడుదల చేయడం విశేషం. మరి బిజెపి తో పొత్తు ఫై త్వరగా ఎవరో ఒకరు అధికారికంగా ప్రకటిస్తే బాగుంటుందని లేదంటే మొదటికే మోసం వస్తుందని అంటున్నారు.
ఇదిలా ఉంటె మొదటి లిస్ట్ ప్రకటించిన తర్వాత టీడీపీ – జనసేన ఆపార్టీలో అసమ్మతి జ్వాలలు మొదలయ్యాయి. టికెట్ కోసం ఎదురుచూసినా ఇరు పార్టీల నేతలు చివరకు టికెట్ దక్కక పోవడం తో వారంతా అధినేతల ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నమ్మించి గొంతు కోశారని వాపోతున్నారు. ఇప్పటికే ఇరు పార్టీల్లో చాలామంది రాజీనామాలు చేయగా..వారిని బుజ్జగించే పనిలో పార్టీల క్యాడర్ చేస్తుంది.
Read Also : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు బాబు వెన్నుపోటు ..