HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Injustice Is Being Done To Our Caste In Telangana Ap Minister

Vasamsetti Subhash : తెలంగాణలో మా కులాన్ని అన్యాయం జరుగుతోంది: ఏపీ మంత్రి

  • Author : Vamsi Chowdary Korata Date : 19-11-2025 - 2:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vasamsetti Subhash Kcr
Vasamsetti Subhash Kcr

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌పై ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. శెట్టి బలిజలను ఓసీల్లో చేర్చి వారి జీవితాలను నాశనం చేశారని ఆరోపించారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఏపీలో కూడా శెట్జి బలిజల్ని ఓసీల్లో చేరుస్తారనే ప్రచారం జరుగుతోందని రెండు నెలల క్రితం మంత్రి ప్రస్తావించారు. అది వైఎస్సార్‌సీపీ నేతల అబద్ధపు ప్రచారమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ‌పై ఏపీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓ సామాజిక వర్గాన్ని ఓసీల్లో చేర్చి అన్యాయం చేశారంటూ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శెట్టి బలిజ సామాజికి వర్గానికి చెందిన కొందరు బంధువులు హైదరాబాద్ వెళ్లి స్థిరపడ్డారన్నారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో శెట్టి బలిజల్ని ఓసీల్లో చేర్చారన్నారు. ఈ క్రమంలో శెట్టి బలిజలు ఓసీలలో కలవడం వల్ల వారి జీవితాలు నాశనం అయ్యాయన్నారు. ఈ నిర్ణయంతో భావితరాల వారి భవిష్యత్ పాడైపోతాయన్నారు. ఏపీ మంత్రి చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో శెట్టి బలిజలు బీసీ కేటగిరిలో ఉన్నారు.. అయితే తెలంగాణలో మాత్రం ఓసీల్లో కలిపారు. ఈ క్రమంలోనే మంత్రి వాసంశెట్టి సుభాష్ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి కూడా శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.

ఏపీలో కూడా రెండు నెలల క్రితం శెట్టిబలిజ బీసీ కులాన్ని ఓసీల్లో చేరుస్తున్నారనే ప్రచారం జరిగింది. దీనిపై మంత్రి వాసంశెట్టి సుభాష్ క్లారిటీ ఇచ్చారు. శెట్టిబలిజలను ఓసీల్లో చేరుస్తున్నారనేది వైఎస్సార్‌సీపీ నేతల అబద్ధపు ప్రచారమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రచారం ద్వారా కులాల మధ్య గొడవలు సృష్టించాలని చూస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగ్గిరెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు.

గీత వృత్తి చేసుకునే వారి గురించి మాట్లాడే అర్హత వైఎస్సార్‌సీపీ నేతలకు లేదన్నారు మంత్రి సుభాష్. కూటమి ప్రభుత్వం గీత వృత్తిదారులకు అండగా నిలుస్తుందని, వారికి మద్యం షాపుల్లో ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తోందని తెలిపారు. మద్యం షాపుల్లో, బార్లలో 10% వారికి కేటాయించినట్లు మంత్రి వివరించారు. వైఎస్సార్‌సీపీ కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని, ఈ తప్పుడు ప్రచారంతో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తాజాగా తెలంగాణలో శెట్టిబలిజల్ని ఓసీల్లో చేర్చడంపై మంత్రి స్పందించారు.. మాజీ సీఎం కేసీఆర్ టార్గెట్‌గా విమర్శలు చేశారు. దీంతో మరోసారి శెట్టి బలిజల అంశం తెరపైకి వచ్చింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • kcr
  • telangana
  • Vasamsetti Subhash

Related News

Kalvakuntla Kavitha lashes out at KTR.

kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌లోకి వెళ్తానని ప్రచారం చేస్తున్నారని.. అయితే తన కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లేదే లేదని, ఆ పార్టీతో జతకట్టేదే లేదని ఆమె స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి బాయి బాటలో భాగంగా కొత్తగూడెం పర్యటనకు వెళ్లిన సందర్భంగా

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • Complaint filed against actor Prakash Raj at the police station.

    Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Latest News

  • Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd