HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >In Undavalli Thieves Attempted A Robbery Opening The Storage Compartments Of 20 Scooters

ఉండవల్లిలో దొంగలు చోరీ.. 20 స్కూటీల డిక్కీలను ఓపెన్‌ *** ?

  • Author : Vamsi Chowdary Korata Date : 02-01-2026 - 3:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Scooty Theft
Scooty Theft

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఇద్దరు ఆగంతకులు హల్ చల్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున వీరు చేసిన పనికి ఊరిజనం అవాక్కయ్యారు. పొద్దున్నే లేచి ఇంటి ముందు చూసిన వారికి మైండ్ బ్లాంక్ అయ్యింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు దీనికి కారణమని గుర్తించారు. వారిని కనిపెట్టే పనిలో ఉన్నారు.

రోజురోజుకూ దొంగలు అప్‌డేట్ అవుతున్నారు. చోరీలు చేసే స్టైల్ మారుస్తున్నారు. ఈ సంగతి వార్తలు ఫాలో అయ్యేవారికి ఇట్టే తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే దొంగల గురించి మాత్రం కాస్త తక్కువగానే విని ఉండొచ్చు. ఎందుకంటే ఈ దొంగలు చోరీ చేసే శైలే కాదు.. చోరీ చేయాలనుకునే టార్గెట్ కూడా డిఫరెంట్ కావున.. ఎవరైనా దొంగతనం చేయాలనుకుంటే.. బాగా డబ్బులు, బంగారం ఉన్న ఇంటికో.. లేదా తాళాలు వేసి ఉన్న ఇళ్లనో టార్గెట్ చేస్తుంటారు. ఇక రోడ్డుపై నడిచి వెళ్లేవారిని లక్ష్యంగా చేసుకునే చైన్‌ స్నాచర్ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక బ్యాంకులు, నగల షాపులకు కన్నాలు వేసే బ్యా్చ్ ఇంకో రకం.కానీ గుంటూరు జిల్లా తాడేపల్లిలో మాత్రం వెరైటీ దొంగలు కలకలం రేపారు.

గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలంలో ఉన్న ఉండవల్లిలో శుక్రవారం కలకలం రేగింది. ఉండవల్లి గ్రామంలో ఇళ్ల బయట పార్కింగ్ చేసి ఉన్న స్కూటీలలో చోరీ జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు.. సుమారు 20 స్కూటీల డిక్కీలను దొంగతనంగా తెరిచారు. స్కూటర్ డిక్కీలలో ఏం దొరుకుతుందని ప్లాన్ చేశారో తెలియదు కానీ.. ఒకటీ రెండు కాదు ఏకంగా 20 స్కూటీల డిక్కీలను తెరిచారు. ఒక స్కూటర్ డిక్కీలో ఉన్న నాలుగు వేల రూపాయల నగదును కాజేశారు. అయితే 20 స్కూటీల డిక్కీలను దొంగతనంగా తెరిచిన దొంగలు.. అందులో ఏమీలేదని గుర్తించిన తర్వాత వాటిని యథాతథంగా పెట్టేశారా అంటే అదీ లేదు.

అన్ని డిక్కీలనూ అలాగే తెరిచి ఉంచి అక్కడి నుంచి ఉడాయించారు. తెల్లారిన తర్వాత ఇంటి బయటకు వచ్చి చూసిన యజమానులు.. ఈ సంగతిని గుర్తించి విస్తుపోయారు. ఆందోళనతో తాడేపల్లి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఫుటేజీలో ఇద్దరు వ్యక్తులు శుక్రవారం తెల్లవారుజామున స్కూటీలు తెరుస్తున్న దృశ్యాలు నమోదయ్యాయి.

ఈ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు.. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని చెప్తున్నారు. అయితే ఏకంగా 20 స్కూటర్ల డిక్కీలను ఓపెన్ చేసి.. 4 వేలు ఎత్తుకెళ్లటం చర్చనీయాంశమైంది. స్కూటర్ డిక్కీలలో ఏం ఉంటాయనే ఆశతో ఆగంతకులు చోరీకి పాల్పడ్డారంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • Guntur District
  • Scooter Dikkies
  • scotty Dikkies Theft
  • tadepalli
  • undavalli

Related News

Lpg Gas Cylinder

Gas cylinder: గ్యాస్ సిలిండర్ తేలేదని.. ఫినాయిల్ తాగిన భార్య..

Suicide Attempt అనంతపురం జిల్లాలో ఒక చిన్న కుటుంబ కలహం తీవ్ర విషాదానికి దారితీసింది. వంట గ్యాస్ సిలిండర్ తీసుకురావడం లేదని మనస్తాపం చెందిన ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన గుత్తి మండలం తొండపాడు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తొండపాడు గ్రామానికి చెందిన హరికృష్ణ, మహాలక్ష్మి దంపతులు. వారి ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయి మూడు నెలలు గడిచింది. సిలిండర్ తీ

  • Cbn Jagan

    AP Capital : జగన్ ను ఊసరవెల్లితో పోల్చిన చంద్రబాబు

  • Amaravati Bill Set

    Nara Lokesh: జగన్ కు నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!!

  • Rajahmundry Kakinada Trains

    Special Train: రాజమండ్రి-కాకినాడ పోర్ట్ స్పెషల్ ట్రైన్: దగ్గుబాటి పురందేశ్వరి

  • Amaravati Capital

    AP Assembly: అమరావతికి చట్టబద్ధత

Latest News

  • Human Trafficking: కట్టుకున్న భార్యను 120 మంది పురుషులకు అమ్మేసిన భర్త.

  • Kerosene supply: గుడ్‌న్యూస్‌.. ఇక రేషన్‌ షాపుల్లో కిరోసిన్‌..

  • Infertility : యువతలో పెరుగుతున్న సంతాన సమస్యలు..కారణం అదే !!

  • Children Stomach Pain : పిల్లల్లో కడుపునొప్పికి కారణాలు

  • Pawan Kalyan : పవన్ అభిమానులకు ఘోర అవమానం తప్పదా ?

Trending News

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd