Sharmila : ఆ విషయంలో అన్న కంటే చెల్లెలు బెటర్.. షర్మిల ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే!
2019 తర్వాత అన్నాచెల్లెళ్ల మధ్య రేగిన చిచ్చు వలన షర్మిల (Sharmila) అన్నను వదిలి తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకుంది.
- By Vamsi Chowdary Korata Published Date - 11:29 AM, Sat - 27 January 24

YS Sharmila : వైయస్ కుటుంబం మతపరంగా క్రైస్తవాన్ని ఆచరిస్తారని ప్రపంచం అంతా తెలుసు. వాళ్లకి అధికారం వచ్చిన ప్రతిసారి ప్రభుత్వ ఖర్చుతో జెరూసలేం వెళ్లే అలవాటు ఉంది. ఈ కుటుంబం అధికారంలో ఉంటే మతమార్పిడులు కూడా అధికంగా జరుగుతాయని ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. పేరెన్నిక గన్న మత బోధకులు కూడా ఈ కుటుంబంలో ఉన్నారు. అయితే వైఎస్ కుటుంబంలో ఒకప్పుడు ఒకే స్వభావాన్ని కలిగి ఉండే అన్నా చెల్లెలు ఇప్పుడు భిన్న స్వభావాలు కనబరుస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
2019 తర్వాత అన్నాచెల్లెళ్ల మధ్య రేగిన చిచ్చు వలన షర్మిల (Sharmila) అన్నను వదిలి తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకుంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ కి మద్దతు తెలిపి పోటీ నుంచి తప్పుకుంది. చివరికి అదే కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీసీసీ పదవిని చేపట్టింది. అలాంటి షర్మిల (Sharmila) తన మతం గురించి బాహాటంగా మాట్లాడుతుంది.
తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తూ ఒక క్రైస్తవురాలిగా మణిపూర్ ఘటనలను చూసి చలించి కాంగ్రెస్ లో కలుస్తున్నాను అని ధైర్యంగా చెప్పింది. ఏపీసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టే క్రమంలో మరొకసారి తను క్రైస్తవురాలు అని చెప్పింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో గోప్యత పాటిస్తారు. మతం వ్యక్తిగత విషయానికి సంబంధించినది, ఎవరికి నచ్చిన మతాన్ని వారు ఆచరించే హక్కు రాజ్యాంగం మనకు ఇచ్చింది అయినప్పటికీ కూడా జగన్ మతం విషయంలో గోప్యత పాటిస్తారు. బహుశా ఓట్ల కోసం కావచ్చు.
విశాఖ స్వామి తో కలిసి పూజలు చేస్తారు గుడులు గోపురాలు తిరుగుతారు అలా అని సతీమణిని ఎప్పుడూ గుడికి తీసుకువెళ్లరు. ప్రసాదం తిన్నట్లు ఫోటోలు వస్తాయి తప్పితే తింటారు లేదో తెలియదు. తనకి ఏ దేవుడి మీద విశ్వాసం ఉందో చెప్పటానికి భయపడతారు. మనం ఆచరించే పద్ధతులను నమ్మకాలను గురించి ధైర్యంగా చెప్పలేని జగన్ కన్నా అతని చెల్లెలు ఈ విషయంలో ఎంతో బెటర్ అంటున్నారు జనాలు.
Also Read: Jagan Siddam : జగన్ ‘సిద్ధం ‘..ఇంటికి పంపడానికి జనం కూడా ‘సిద్ధం’