Jagan Siddam : జగన్ ‘సిద్ధం ‘..ఇంటికి పంపడానికి జనం కూడా ‘సిద్ధం’
- By Sudheer Published Date - 11:04 AM, Sat - 27 January 24

గత ఎన్నికల్లో భారీ మెజార్టీ తో విజయం సాధించిన వైసీపీ (YCP)..ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తుందో లేదో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. గత ఎన్నికల్లో జగన్ పాదయాత్ర బాగా ప్లస్ అయ్యింది..అలాగే వైస్సార్ కొడుకు కు ఒక్క ఛాన్స్ ఇద్దామని జనం డిసైడ్ అయ్యి ఓట్లు గుద్దేసారు. కానీ ఇప్పుడు జనం మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టంగా అర్ధం అవుతుంది..అందుకే జగన్ సరికొత్త ప్రణాళికలతో ప్రజలను తన వైపు తెప్పుకునేందుకు చూస్తున్నాడు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేతలను పక్కకు పెట్టి కొత్త వారికీ ఛాన్స్ ఇస్తున్నాడు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఇప్పుడు ఈరోజు నుండి జగన్ ఎన్నికల శంఖారావం (Jagan to begin Election campaign) పూరించబోతున్నాడు. వై నాట్ 175 నినాదంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాడు. నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు డిసైడ్ అయ్యారు. ముందుగా పార్టీ కేడర్ తో మమేకం కావాలని ..అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అయిదు భారీ సభలకు ప్లాన్ చేసారు. అందులో భాగంగా ఈ రోజు భీమిలో (Bhimili) సముద్ర తీరాన జన హోరు కనిపించేలా పార్టీ సిద్ధం (Siddam) పేరుతో భారీ సభ నిర్వహిస్తున్నది.
ఈ సభకు దాదాపు 34 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, గృహసారథులు రావాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఇప్పటికే పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం వైజాగ్ చేరుకోనున్న సీఎం జగన్ భీమిలీ సంగివలసలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలకు దిశానిర్థేశం చేయనున్నారు. పార్టీ శ్రేణులతో ఆయన మాటమంతి నిర్వహిస్తారు.
ఇలా జగన్ సిద్ధం అంటుంటే..టీడీపీ మాత్రం నిన్ను ఇంటికి పంపడానికి జనం కూడా సిద్ధం జగన్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. తాజాగా ఇదే విషయాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రోడ్డు పక్కన ఉన్న జగన్ సిద్ధం హోర్డింగ్ ను చూపిస్తూ..’నిన్ను ఇంటికి పంపడానికి జనం కూడా సిద్ధం జగన్’ అంటూ రాసుకొచ్చారు. మరి ఈ సభలో జగన్..కొత్తగా ఏమైనా మాట్లాడతారా..లేక పాత స్క్రిప్ట్ నే మళ్లీ చదువుతారా అనేది చూడాలి.
నిన్ను ఇంటికి పంపడానికి జనం కూడా సిద్ధం జగన్! #ChatthaRoadsChatthaCM #WhyAPHatesJagan #2024JaganNoMore pic.twitter.com/fSD6THmAZE
— Lokesh Nara (@naralokesh) January 26, 2024
Read Also : TDP Public Meeting : కాసేపట్లో ఉరవకొండ కు చంద్రబాబు..