Pawan Kalyan : నేను ప్రధాని మోడీ హృదయంలో ఉన్నాను: పవన్ కల్యాణ్
కష్టపడిన వారిని మరిచిపోబోమని తెలిపారు. హరిప్రసాద్ కు గుర్తింపు లభించినట్టే అందరికీ గుర్తింపు ఉంటుందని… నామినేటెడ్ పోస్టులు ఉంటాయి.
- By Latha Suma Published Date - 02:49 PM, Mon - 15 July 24

Pawan Kalyan: మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు జనసేన ప్రజాప్రతినిధులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమాలో పాల్గొన్న జనసేన అధినేత, ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..కష్టపడిన వారిని మరిచిపోబోమని తెలిపారు. హరిప్రసాద్ కు గుర్తింపు లభించినట్టే అందరికీ గుర్తింపు ఉంటుందని… నామినేటెడ్ పోస్టులు ఉంటాయి.. కానీ ప్రతి ఒక్కరూ ఛైర్మన్ ప దవులు ఆశి స్తే కష్టమని చెప్పారు. మన పార్టీ అయినా సరే… రౌడీయిజంతో భయపెట్టాలని చూస్తే పార్టీ నుండి బయటకే అని హెచ్చరించారు. ఐదు కోట్ల మంది ప్రజలు ఏకతాటిపైకి వచ్చి అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన మొత్తం 21 మంది గెలిచారని సంతోషం వ్యక్తం చేశారు. తాను నటించిన సినిమాల గురించి కూడా పెద్దగా మాట్లాడనని, కానీ ఇది ప్రజలకు సంబంధించిన విజయం కాబట్టి ఇవాళ మాట్లాడుతున్నానని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇకపోతే, తాను ప్రధాని నరేంద్ర మోడీ హృదయంలో ఉన్నానని, ప్రత్యేకంగా ఆయన పక్కన నిల్చుని ఫొటో తీయించుకోవాలని కోరుకోనని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఎక్కడైనా మోడీని కలిస్తే 60 సెకన్ల కంటే ఆయనతో ఎక్కువ సేపు మాట్లాడడని, ఆ స్థాయి వ్యక్తి ఎంతో బిజీగా ఉంటారని, అలాంటి వ్యక్తి సమయం వృథా చేయరాదని భావిస్తానని వెల్లడించారు. తన స్వార్థానికి తాను ఏమీ అడగనని, ఇప్పటివరకు ప్రధాని ఏమీ అడగనని, కానీ రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల కోసం అడుగుతానని అన్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని, విశాఖ రైల్వే జోన్ కావాలని, 20 లక్షల ఉద్యోగాలు కావాలని అడుగుతానని పవన్ వివరిచంచారు. జననసే పార్టీలో చాలామంది పదవులు అడుగుతున్నారని, ఒక్క టీటీడీ చైర్మన్ పదవిని 50 మంది అడిగారని వెల్లడించారు. కానీ ఆ పదవి ఒక్కరికే ఇవ్వగలరన్నారు. నా కుటుంబ సభ్యులెవరు టీటీడీ ఛైర్మన్ పదవి అడగలేదు….కానీ నా కుటుంబ సభ్యులు టీటీడీ ఛైర్మన్ పదవి అడిగారని ప్రచారంలో పెట్టారు.. అది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు.