Kanaka Durga Temple: కార్తీక సోమవారం సందర్భంగా దుర్గమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు.!
కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు.
- Author : hashtagu
Date : 07-11-2022 - 12:31 IST
Published By : Hashtagu Telugu Desk
కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి క్యూ లైన్‌లో భక్తులు కిక్కిరిశారు. ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రంతో మారుమోగుతున్న శివాలయాలు… పంచారామ క్షేత్రాలు, శైవ క్షేత్రాలలో భక్తులు పోటెత్తారు. కార్తీక సోమవారం సందర్భంగా శివునికి ప్రత్యేకమైన రుద్రాభిషేకాలు, మహా రుద్రాభిషేకాలు, బిల్వార్చనలను ఆలయ అర్చకులు నిర్వహిస్తున్నారు.
పంచామృతాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి ఉపవాసం ఉండి 365 వత్తులు వెలిగించుకుంటున్నారు. ఉదయం నుంచి కృష్ణా నదిలో స్నానాలు ఆచరిస్తున్నారు. దీపాలను భక్తులు నదిలో వదులుతున్నారు. కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం నిర్వహించారు. అమ్మవారి భక్తుల కోసం భవానీల కోసం ఈ రోజు నుంచి గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేశారు.