Accident : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
- By Sudheer Published Date - 08:56 PM, Sat - 22 July 23

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆర్టీసీ బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రస్తుతం ప్రజలు రోడ్డు ఎక్కాలంటే వణికిపోతున్నారు. ఎటునుండి మృతువు ఏ రూపంలో వస్తుందో అని భయపడుతున్నారు. మనం రోడ్ ఫై బాగానే వెళ్తున్నప్పటికీ అవతలి వ్యక్తి ఎలా వస్తాడో అర్ధం కావడం లేదు. కొంతమంది మద్యం మత్తులో ప్రమాదాలు చేస్తుంటే..మరికొంతమంది ఓవర్ స్పీడ్ తో ప్రమాదాలు చేస్తున్నారు. దీంతో అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.
తాజాగా ఏపీలోని అన్నమయ్య జిల్లా (Annamayya District) పుల్లంపేట మండలంలో శనివారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా , మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి (Govt Hospital)కి తరలించి చికిత్స అందిస్తున్నారు. పుల్లంపేట సమీపంలోని మలుపు వద్ద జాతీయ రహదారిపై కడప నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ వేగంగా ఢీకొట్టింది.
దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లారీ డ్రైవర్ అతివేగమే ప్రమదానికి కారణమని పోలీసులు, స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాద ఘటనతో రాజంపేట-తిరుపతి జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఈ ప్రమాదంలో ఓబులవారిపల్లె మండలానికి చెందిన గుండాల శ్రీనివాసులు అలియాస్ బుడ్డయ్య (62), రాజంపేట మండలం వెంకట రాజంపేటకు చెందిన శేఖర్ (45), కడపకు చెందిన బాషా (65) మృతి చెందారు.
Read Also : ఓటరు జాబితా సర్వేలో వాలంటీర్లు పాల్గొనడం ఫై పవన్ ట్వీట్