HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >How Much Is The Fee Of Lawyer Siddharth Luthra

Siddharth Luthra: చంద్రబాబు తరఫున వాదించే లాయర్ సిద్దార్థ్ లూథ్రా ఫీజు ఎంతంటే..?

చంద్రబాబు నాయుడు తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లుథ్రా (Siddharth Luthra) వాదనలు వినిపించనున్నారు. ఈయన సుప్రీంకోర్టు లాయర్.

  • By Gopichand Published Date - 06:54 AM, Sun - 10 September 23
  • daily-hunt
Siddharth Luthra
Compressjpeg.online 1280x720 Image 11zon

Siddharth Luthra: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు (Chandrababu Arrest) ఏపీలో రాజకీయ కలకలం రేపుతోంది. శనివారం ఉదయం 6 గంటలకు సీఐడీ పోలీసులు నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో ఆయన్ని అరెస్టు చేసినట్లు సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ మీడియాకు తెలిపారు.

చంద్రబాబు నాయుడు తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లుథ్రా (Siddharth Luthra) వాదనలు వినిపించనున్నారు. ఈయన సుప్రీంకోర్టు లాయర్. అయితే టీడీపీ చంద్రబాబు కోసం దేశంలోనే టాప్ న్యాయవాదిగా పేరున్న సిద్దార్థ్ లూథ్రాను నియమించుకుంది. అత్యంత ఖరీదైన న్యాయవాదుల్లో లూథ్రా ఒకరు కాగా.. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన వచ్చారు. ఢిల్లీ బయట కేసులు వాదించేందుకు రోజుకు రూ.1.50 కోట్ల వరకు ఆయనకు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. ఫ్లైట్, లగ్జరీ కారు, స్టార్ హోటల్లో బస సౌకర్యాలు అదనం.

Also Read: Chandrababu Arrest: మళ్లీ సిట్‌ ఆఫీసుకు చంద్రబాబు.. టీడీపీ లీడర్ల ఆగ్రహం

Siddarth Luthra preparing to argue in Vijayawada ACB court!#ChandrababuArrest #ChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/SP4wA0ki2o

— Madhu (@offlinemadhu) September 9, 2023

విజయవాడలోని ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫున లాయర్ సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. గతంలో అమరావతి భూముల కేసును కూడా సిద్ధార్థ్ లూథ్రానే వాదించారు. అలాగే చంద్రబాబు ఇతర కేసులనూ సిద్ధార్థ్ లూథ్రా చూస్తున్నారు. వివేకా హత్య కేసులోనూ సునీత తరఫున వాదనలు వినిపించారు సిద్దార్థ్.

సిద్ధార్థ్ లూథ్రా తండ్రి కె.కె. లూథ్రా కూడా న్యాయవాదిగా పనిచేశారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీల నుంచి సిద్ధార్థ్ లూథ్రా న్యాయశాస్త్రంలో పట్టాలు అందుకున్నారు. 1990లో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. న్యాయ సంబంధ అంశాలపై సిద్ధార్థ్ లూథ్రా అధ్యయనం కూడా చేశారు. ఆయన ప్రతిపాదించిన పలు అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. పలు పుస్తకాలను కూడా రాశారు. భారత్‌తో పాటు ఇతర దేశాల కోర్టుల్లోనూ సేవలు అందించిన అనుభవం సిద్ధార్థ్ లూథ్రాకు ఉంది. మరోవైపు సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్, వివేకానంద వాదనలు వినిపించనున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ACB Court
  • ap politics
  • Chandrababu Case
  • Lawyer Fees
  • Siddharth Luthra
  • vijayawada

Related News

    Latest News

    • Bomb Threat : సీఎం స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపు

    • Rains : అల్లకల్లోలంగా శ్రీకాకుళం

    • Karthika Masam : కార్తీక మాసం ప్రారంభం కానుంది..!

    • BSNL : దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ eసిమ్ సేవలు

    • Devaragattu Festival : కర్రల సమరం.. 100 మందికి గాయాలు

    Trending News

      • Social Media: ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. సోష‌ల్ మీడియాపై మంత్రుల‌తో క‌మిటీ!

      • Youngest Billionaire: భారతదేశంలో అతి పిన్న వయస్కుడైన బిలియనీర్ ఇత‌నే.. సంపాద‌న ఎంతంటే?

      • Ramreddy Damodar Reddy: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత.. ఆయ‌న రాజ‌కీయ జీవిత‌మిదే!

      • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం!

      • Vijayadashami: రేపే దసరా.. విజయదశమి నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd