HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Hey Why Are You Here Who Told You To Come Balakrishnas Fire At The Airport What Really Happened

Nandamuri Balakrishna : ఏయ్ నువ్వెందుకు వచ్చావ్.. ఎవడు రమ్మన్నాడు.. ఎయిర్‌పోర్టులో బాలకృష్ణ ఫైర్ .. అసలేమైంది?

  • By Vamsi Chowdary Korata Published Date - 05:46 PM, Tue - 18 November 25
  • daily-hunt
Nandamuri Balakrishna
Nandamuri Balakrishna

సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి వార్తల్లో నిలిచారు. విశాఖ ఎయిర్‌పోర్టులో బాలయ్య కోపంతో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఖండ 2 సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం విశాఖపట్నం వచ్చింది. ఈ సందర్ఫంగా కొంతమంది అభిమానులు విశాఖ విమానాశ్రయంలో బాలకృష్ణను కలిసేందుకు ఉత్సాహం చూపించారు. ఈ సందర్భంగా బాలయ్య ఓ వ్యక్తిపై చిందులు వేశారు. నువ్వెందుకు వచ్చావ్ ఇక్కడకు అంటూ కోపగించుకున్నారు. వెనక్కి వెళ్లు, సాయంత్రం కూడా రాకూడదంటూ కోపం ప్రదర్శించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి కోపగించుకున్నారు. సాధారణంగా ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపిస్తుంటారు బాలయ్య. అలాంటి బాలయ్యకు కోపం వస్తే ఎలాం ఉంటుందో అందరికీ తెలిసిన సంగతే. ఆగ్రహంతో ఊగిపోతుంటారు. అయితే బాలకృష్ణ ఎంత కోప్పడినా.. అది మా బాలయ్య ప్రేమ అంటూ మురిసిపోతుంటారు. బాలకృష్ణ కోపానికి సంబంధించి గతంలో ఎన్నో ఘటనలు చూశాం. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. విశాఖపట్నం విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. అయితే ఏం జరిగిందనే దానిపై క్లారిటీ లేదు కానీ.. ఓ వ్యక్తిని చూసి బాలయ్య చిందులేశారు. నువ్వెందుకు వచ్చావ్ ఇక్కడికీ అంటూ కోపంతో ఊగిపోయారు.

నిన్ను ఇక్కడికి ఎవడు రమ్మన్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వెళ్లిపో.. సాయంత్రం కూడా వాడు కనిపించకూడదు అంటూ పక్కనున్న వారికి సూచించారు. అయితే ఎవరా వ్యక్తి.. ఏం జరిగిందనేదీ తెలియడం లేదు కానీ.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే తనను పలకరించడానికి వచ్చిన మహిళలతో అభిమానంగా మాట్లాడారు బాలకృష్ణ. సెల్ఫీలు కూడా దిగారు.

మరోవైపు బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం.. డిసెంబర్ నెలలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే అఖండ 2 టీమ్ విశాఖలో ఈవెంట్ నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ కోసం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్, నిర్మాత రామ్ ఆచంట విశాఖకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. మరోవైపు విశాఖ చేరుకున్న బాలకృష్ణ.. సింహాచలం అప్పన్నను దర్శించుకున్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను, ప్రొడ్యూసర్ రామ్ ఆచంటతో కలిసి సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారినిదర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అంతకుముందు ఆలయానికి వచ్చిన అఖండ 2 చిత్ర బృందానికి ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభ ఆలింగనం, బేడా మండపం చుట్టూ చిత్ర బృందం ప్రదక్షిణలు చేసింది. ఆ తరువాత శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి మూల విరాట్టును దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సినిమా యూనిట్‌కు వేద ఆశీర్వచనం అందించారు. మరోవైపు అఖండ 2 సినిమాలోని తాండవం పాట ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. దీనికి మంచి స్పందన లభిస్తోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • actor nandamuri balakrishna
  • airport
  • Hindupur MLA Nandamuri Balakrishna
  • nandamuri balakrishna
  • Visakhapatnam

Related News

Immadi Ravi Father Apparao

iBOMMA : ఇమ్మడి రవికి కఠిన శిక్షలు..? అతని తండ్రి ఏమన్నాడంటే..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉన్న అంశం ఐబొమ్మ ఓనర్ ఇమ్మడి రవి అరెస్ట్.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇమ్మడి రవిని ఇటీవల అరెస్ట్ చేశారు. కాపీరైట్ యాక్ట్, ఐటీ యాక్ట్ కింద అతనిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్నారు. మరోవైపు ఇమ్మడి రవి సొంతూరు విశాఖపట్నం. అతని తండ్రి అప్పారావు బీఎస్ఎన్ఎల్ మాజీ ఉద్యోగి. ఇమ్మడి రవి అరెస్ట్ మీద ఆయన

  • Jd Lakshmi Narayana

    CII Summit Vizag : ఈ మూడు పనులు చేస్తే ఏపీ సూపర్..చంద్రబాబుతో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.!

  • Cii Summit 2025 Visakhapatn

    CII Summit 2025 Visakhapatnam : విశాఖపట్నంలో సీఐఐ సదస్సు..!

  • Vizag It Capital

    Vizag : విశాఖలో మరో ఐటీ క్యాంపస్

Latest News

  • IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఈ ఆటగాళ్లు వేలంలోకి ఎందుకు రాలేకపోతున్నారు?

  • Prabhas: జపాన్ కు వెళ్లనున్న ప్రభాస్.. కారణం ఇదే!

  • X Down: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ఎక్స్‌ సేవలు!

  • Test Coach: టీమిండియా టెస్ట్ జ‌ట్టుకు కొత్త కోచ్‌.. ఎవ‌రంటే?!

  • Nandamuri Balakrishna : ఏయ్ నువ్వెందుకు వచ్చావ్.. ఎవడు రమ్మన్నాడు.. ఎయిర్‌పోర్టులో బాలకృష్ణ ఫైర్ .. అసలేమైంది?

Trending News

    • Coach Gambhir: హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రయోగాలు భారత్‌కు భారంగా మారుతున్నాయా?

    • Former PM Sheikh Hasina : షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు భారత్ అప్పగిస్తుందా..?

    • Andre Russell: ఐపీఎల్‌లో ఆండ్రీ రసెల్ కోసం రెండు జ‌ట్ల మ‌ధ్య పోటీ?!

    • Maoist Hidma : వందల మంది మృతికి హిడ్మానే కారణం!

    • Madvi Hidma : ఏపీలో భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ, అగ్రనేత హిడ్మా హతం.!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd