HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Heavy Rains In These Districts

Rain Alert: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

  • Author : Vamsi Chowdary Korata Date : 06-07-2026 - 9:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Heavy rains in these districts of AP
Heavy rains in these districts of AP

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వాయుగుండం తీరం దాటినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గడిచిన ఆరు గంటలలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలిన వాయుగుండం.. ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో తీరాన్ని దాటినట్లు ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వాయుగుండం రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర ఒడిశా, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

దీని ప్రభావంతో సోమవారం రోజున విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు ఈదురు గాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వర్షం కురిసే సమయంలో కల్వర్టులు, కాలువల సమీపంలోకి వెళ్లవద్దని సూచించింది.

మరోవైపు ఎల్‌నినో ప్రభావం ఖరీఫ్ సీజన్ మీద పడుతోంది. ఎల్‌నినో కారణంగా అడపాదడపా వానలు పడుతున్నా.. సాగుకు అనుకూల వాతావరణం ఉండటం లేదు. అలాగే కృష్ణా పరివాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటకలలోనూ జూన్ నెలలో ఆశించిన మేరకు వర్షాలు కురవలేదు. ఇక కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ బ్యారేజీలు నిండితే తప్ప దిగువన ఉన్న జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులకు నీరు చేరుతుంది. అయితే జూన్ నెలలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవటంతో.. ఎగువ జలాశయాలకు నీరు చేరలేదు. మరోవైపు గోదావరి నదిలో నీటి ప్రవాహం అధికమైతే.. పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజీకి నీరు చేరుతుంది. ప్రస్తుతానికి అక్కడ కూడా ఆ పరిస్థితి లేదు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh rain alert
  • AP Rain Alert
  • Heavy Rain Alert
  • IMD Rain Alert
  • rain alert
  • Rain Alert in Andhra Pradesh
  • rain alert in AP
  • rain alert to andhra pradesh
  • Rain Alert Today

Related News

Depression in the Bay of Bengal... Very heavy rains for several districts.

Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. పలు జిల్లాలకు అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారడంతో తెలంగాణ వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భారత వాతావరణ శాఖ నివేదికల ప్రకారం, ఈ వాయుగుండం ప్రస్తుతం ఒడిశాలోని బాలాసోర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో, చాంద్‌బలి, దిఘాలకు 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో పాటు ఉపరితల ఆవర్తనం, చురుగ్గా కదులుతున్న రుతుపవనాల కారణంగా తెలంగాణ

  • Depression in the Bay of Bengal... Very heavy rains for several districts.

    Weather Report: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాల

  • Heavy rains in these districts of AP

    Weather Forecast Update: ఏపీలో భారీ వర్షాలు

  • Heavy rain warning for these districts in Telangana!

    Rain Alert: తెలంగాణలో ఈ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక!

  • Heavy rains in these districts of AP

    Heavy Rain Alert: 24 గంటల్లో రాష్ట్రమంతా వర్షాలు

Latest News

  • Ghatkesar: కన్నతల్లిపైనే లైంగిక దాడి

  • APSPDCL: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీకి గ్రీన్ సిగ్నల్

  • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

  • Jnaneswari Missing: తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన నేటికీ నెల.. పాపకు ఏమై ఉంటుంది?

  • TTD: 116 ఏళ్ల బామ్మకు శ్రీవారి దివ్య దర్శనం.. ఆదేశాలు జారీ చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

Trending News

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd