HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Heavy Rains In Andhrapradesh 3

Heavy Rains: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు పొంచి ఉన్న వాన ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వెంబడి కేంద్రీకృతమైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

  • Author : Gopichand Date : 13-11-2024 - 10:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
IMD Issued Alert
IMD Issued Alert

Heavy Rains: అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు (Heavy Rains) దంచికొడుతున్నాయి. తిరుపతి, ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరులో మరో 3 రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ, దక్షిణ కోస్తాలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

నేడు ఈ జిల్లాల్లో వ‌ర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వెంబడి కేంద్రీకృతమైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో బుధ‌వారం.. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Also Read: Vishwak Sen : నాకు 100 కోట్ల కలెక్షన్ కాదు.. 100 కోట్ల రెమ్యునరేషన్ రావాలి.. విశ్వక్ సేన్ కామెంట్స్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ మంగళవారం (నవంబర్ 11) అంచనా వేసిన విష‌యం తెలిసిందే. వాతావరణ శాఖ ప్రకారం.. నవంబర్ 15 వరకు దక్షిణ కోస్తా, రాయలసీమలోని వివిధ‌ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు ఇప్ప‌టికే ప‌లు సూచ‌న‌లు చేశారు. మ‌త్స్య‌కారులు చేప‌ల వేట‌కు వెళ్లొద్ద‌ని సూచించారు.

నైరుతి బంగాళాఖాతం నుండి NCAP నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి తక్కువగా గుర్తించబడిందని కూడా పేర్కొంది. ఇదిలా ఉండగా ఏపీ రాజధాని అమరావతిలోని తాడేపల్లి, ఇతర ప్రాంతాల్లో మంగళవారం మేఘావృతమైన వాతావరణంతో తేలికపాటి జల్లులు పడ్డాయి. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో నైరుతి ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అనుబంధ తుఫాను ప్రసరణ ఇప్పుడు సముద్ర మట్టానికి సగటున 4.5 కి.మీ వరకు విస్తరించి ఉంద‌ని వాతవార‌ణ శాఖ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap rains
  • gunturu
  • heavy rains
  • Heavy rains in AP
  • IMD alert
  • Kadapa
  • Nellore
  • rains
  • rains in AP
  • Tirupati

Related News

Atchannaidu Vs Botsa Satyanarayana

బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

Acham Naidu Vs Botsa Satyanarayana  ఏపీ శాసనమండలి సమావేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభలోకి విజిల్స్ తీసుకొచ్చిన వైసీపీ సభ్యులు… ఛైర్మన్ పోడియం వద్ద విజిల్స్ వేస్తూ హంగామా సృష్టించారు. ఈ క్రమంలో సభ కాసేపు వాయిదా పడంది. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

  • Andhra Pradesh Earthquake

    ఏపీలో భూకంపం టెన్షన్.. పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున కంపించిన భూమి

  • Minister Narayana

    గుడ్ న్యూస్.. ఏపీలో ఖాళీ స్థలాలపై పన్ను 50 శాతం రాయితీ

  • Andhra Pradesh Logo

    ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..

  • Dhulipalla Narendra Kumar

    టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో బంగారం, వెండి, డబ్బులు చోరీ

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

  • కాంగ్రెస్ నాయ‌కుల‌కు నోటీసులు పంపిన లోక్‌స‌భ ప్రివిలేజ్ క‌మిటీ!

  • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

  • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

  • మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd