AP : రెండు రోజుల పాటు భారీ వర్షాలు: వాతావరణ శాఖ..!!
ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
- By hashtagu Published Date - 10:09 AM, Mon - 29 August 22

ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు విదర్భ నుంచి కోస్తాంధ్ర వరకు…ఉత్తర, దక్షిణ ద్రోణి కోనసాగుతోందని తెలిపింది. సముద్రమట్టానికి 0.9కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించినట్లు తెలిపింది. దీంతో ఇవాళ, రేపు ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పలుచోట్లు ఉరుములు, మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. రెండు రోజుల తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయన్నారు. మరోవైపు అనంతపురం జిల్లాలో ఐదురోజులుగా వర్షాలు కురస్తున్నాయి. ఆదివారం ఉదయం వరకు భారీవర్షాలు కురిశాయి. జిల్లా వ్యాప్తంగా వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.