HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Heavy Rain Alert For Ap 2

Weather Update: ఏపీకి భారీ వర్షాల అలర్ట్‌

  • Author : Vamsi Chowdary Korata Date : 20-07-2026 - 8:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Heavy rain alert for AP.
Heavy rain alert for AP.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం పలు జిల్లాలలో వర్షం కురవనుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మేఘావృతమైన వాతావరణంతో పాటు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పోలవరం, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాలలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అంచనా వేశారు. మరోవైపు గురువారం వరకూ ఏపీలో మేఘావృత వాతావరణం, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.

మరోవైపు ఎల్ నినో ప్రభావంతో ఈసారి తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఇటీవల సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశం సందర్భంగా రైతులకు నిరంతర సాంకేతిక సలహాలు అందిస్తూ, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించారు. అలాగే తక్కువ కాలపరిమితి పంటలు, డ్రై సోయింగ్‌ను విస్తృతంగా ప్రోత్సహించాలని నిర్ణయించారు. మేత పంటలకు రక్షిత సాగునీరు కల్పించాలని, పశుగ్రాస కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు.

ప్రతి మండలంలో కనీసం ఒక పశు శిబిరమైనా ఏర్పాటు చేయాలని, ఆ శిబిరం ద్వారా పశువులకు తాగునీరు, పశుగ్రాసం, వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని సీఎస్ సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి క్షేత్రస్థాయిలో చర్యల అమలుపై నిరంతర సమీక్ష నిర్వహించాలని స్పష్టం చేశారు. అలాగే రైతులు, పశుపోషకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎస్ స్పష్టం చేశారు. ఇక ఎల్ నినో కారణంగా జులై నెలలో ఏపీలో 35 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh rain alert
  • AP Rain Alert
  • Heavy Rain Alert
  • IMD Rain Alert
  • rain alert
  • Rain Alert in Andhra Pradesh
  • rain alert in AP
  • rain alert to andhra pradesh
  • Rain Alert Today

Related News

Cool news for the public... rains in those districts today.

Rain Alert: ప్రజలకు చల్లటి కబురు.. నేడు ఆ జిల్లాల్లో వానలు

ఎల్‌నినో కారణంగా లోటు వర్షపాతంతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ రైతులకు వాతావరణ శాఖ అధికారులు ఊరట కలిగించే వార్త వినిపించారు. ఏపీలో వచ్చే మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, దానికి అనుబంధంగా విస్తరించి ఉన్న ద్రోణి ప

  • Low-pressure area intensifying! Heavy rains in Telangana... Here is the weather report.

    Rain Alert: బలపడుతున్న అల్పపీడనం..!తెలంగాణలో భారీ వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్

  • Cool news for the public... rains in those districts today.

    Rain Alert: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాలో భారీ వర్షాలు

  • Cool news for the public... rains in those districts today.

    Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు

  • Heavy rains in AP... Dark clouds gathering.

    Rain Alert: ఏపీలో భారీ వర్షాలు.. కమ్ము కోస్తున్న కారు మబ్బులు

Latest News

  • CJP Protest Delhi: ఢిల్లీ పోలీసులపై రాళ్ల దాడి

  • COVID: ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

  • Telangana Government: తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. రాష్ట్రంలో 40 ఏళ్లు దాటిన ఉద్యోగులకు ఫ్రీ హెల్త్ చెకప్

  • CJP: కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో CJP నేతల భేటీ.. కాక్రోచ్ పార్టీ 3 డిమాండ్లు

  • Kuwait desalination plant: ఇరాన్ దాడి తర్వాత కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం..

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd