Flood Water Increasing in Munneru River : భయం గుప్పింట్లో ఖమ్మం..
Flood Water Increasing in Munneru River : శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయానికి మున్నేరు వరద ఉదృతి 16 అడుగులకు చేరుకుంది. దీంతో కవిరాజు నగర్, బొక్కల గడ్డ, మున్నేరు పరివాహక ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.
- By Sudheer Published Date - 10:45 AM, Sun - 8 September 24

Flood Water Increasing in Munneru River : మరోసారి మున్నేరు ‘ఖమ్మం ‘ (Khammam) ప్రజలను వణికిస్తోంది. గత శనివారం మున్నేరు ఉదృతి (Munneru River) నుండి ఇంకా తేరుకోకముందే మరోసారి ఉగ్రరూపం దాలుస్తుండం తో ప్రజలు వణికిపోతున్నారు. ఖమ్మం రూరల్ మండలాల పరిధిలోని మున్నేరు ముంపు గ్రామాల ప్రజలు క్షణం క్షణం భయపడుతూ జీవనం సాగిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయానికి మున్నేరు వరద ఉదృతి 16 అడుగులకు చేరుకుంది. దీంతో కవిరాజు నగర్, బొక్కల గడ్డ, మున్నేరు పరివాహక ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. గంట గంటకు మున్నేరు వాగు పెరుగుతుండడం తో పోలీస్ శాఖ అప్రమత్తమై స్థానిక ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ధంసలపురం ప్రభుత్వ పాఠశాల, ఖమ్మం మహిళా డిగ్రీ కళాశాల, స్వర్ణభారతి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలకు వారిని తరలించారు.
వరద 24 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక
నిన్నటి నుండి ఖమ్మం , మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మున్నేరుకు వరద పోటెత్తింది. ప్రస్తుత నీటి మట్టం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద 24 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. మున్నేరుకు భారీ వరద పొంచి ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులందరికీ సూచించారు. పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు, ప్రజలకు సహాయ సేవలు నిరంతరం అందుబాటులో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
Read Also : Chiranjeevi New Commercial Ad : మెగాస్టార్ ‘మెగా మాస్’ యాడ్ చూసారా..?