HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Health And Wellness Program In Ap Schools

AP Health And Wellness: ఏపీ పాఠశాలల్లో హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ ప్రోగ్రాం

  • Author : Vamsi Chowdary Korata Date : 28-03-2026 - 1:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Health And Wellness
Ap Health And Wellness

ఏపీ ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ చర్యల్లో భాగంగా సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దేశంలోనే 13-19 ఏళ్ల మధ్య వయస్సు గల విద్యార్థులకు స్కూల్ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ ప్రోగ్రాంను ప్రారంభించింది. ఈ డిజిటల్‌ పోర్టల్‌కు మంచి స్పందన వస్తోంది. డిజిటల్‌ హెల్త్‌ పోర్టల్‌ అందుబాటులోకి తీసుకురాగా.. ఈ-లెర్నింగ్‌ ద్వారా ఆరోగ్య విద్యను చేరువ చేసేలా చర్యలు చేపట్టారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కోసం మరో వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. 13-19 ఏళ్ల మధ్య వయస్సు గల విద్యార్థుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేయడం కోసం ‘స్కూల్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ ప్రోగ్రాం (ఎస్‌హెచ్‌డబ్ల్యూపీ)’ డిజిటల్‌ పోర్టల్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. apshwp.ap.gov.in పోర్టల్‌ను వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ రూపొందించగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభంగా ఉండేందుకు ఇంగ్లీష్, తెలుగు భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. పలు సంస్థల భాగస్వామ్యంతో ఈ డిజిటల్ పోర్టల్‌ను రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో టీచర్లు, లెక్చరర్లను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు. వీరు ఈ పోర్టల్‌ ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరిస్తారు.

విద్యార్థులకు పలు అంశాలపై డిజిటల్‌ పాఠ్యాంశాలను వీడియోలు, ప్రజెంటేషన్లు, డాక్యుమెంట్ల రూపంలో అందుబాటులోకి తెచ్చారు. ఈ టాపిక్స్‌లో మెటబాలిక్‌ హెల్త్‌, రోడ్ సేఫ్టీ, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ అవగాహన, పోషణ – జీవనశైలి, మానసిక ఆరోగ్యం, రక్తహీనత వంటివి ఉన్నాయి. నైతిక విలువలు, పౌష్టికాహారం ప్రాముఖ్యత, వ్యక్తిగత పరిశుభ్రత వంటి పలు అంశాలపై వీరికి అవగాహన కల్పిస్తారు. క్విజ్‌లు, ఆన్‌లైన్ పరీక్షలు కూడా ఉంటాయి. వీటిలో ప్రతిభ కనబరిచిన వారికి సర్టిఫికెట్లు కూడా జారీ చేయాలని అధికారులు ఏర్పాటు చేశారు.

దేశంలోనే తొలిసారి ‘స్కూల్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ ప్రోగ్రాం’ను డిజిటలైజ్‌ చేసి ఆయుష్మాన్‌ భారత్‌లో భాగంగా అందుబాటులోకి తెచ్చామని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు తగిన విధంగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని ఆయన అన్నారు. ఈ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 36,297 మంది విద్యార్థులు సరికొత్త విషయాలు తెలుసుకున్నారని, వీరిలో 75 శాతం మంది బాలికలు ఉన్నారని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ‘స్కూల్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ ప్రోగ్రాం’ పోర్టల్ ద్వారా 11 ప్రధాన అంశాల సమాచారాన్ని కూడా అందుబాటులో ఉంచారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా అవగాహన కల్పించాలని అధికారులు అంటున్నారు. పేరు, మొబైల్‌ నంబరు, మెయిల్‌ ఐడీతో లాగిన్‌ అవ్వొచ్చు అని వారు చెబుతున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh CM Chandrababu Naidu
  • andhra pradesh government
  • AP schools
  • Education Minister Nara Lokesh
  • health and wellness
  • students

Related News

Good news for the unemployed in AP: Green signal given to fill job vacancies in the Electricity Department.

Andhra Pradesh: ఏపీలో కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్ల

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. శాంతిభద్రతలను మెరుగుపరచడం, పోలీస్ వ్యవస్థను అధునీకరించేందుకు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్తగా తిరుపతి, గుంటూరు, రాజమండ్రిని పోలీస్ కమిష

  • CM Chandrababu to inaugurate the Rayalaseema Steel Plant in Kadapa.

    Chandrababu Naidu: రాయలసీమ ఉక్కు కడప స్టీల్ ప్లాంట్‌ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

  • Capital war reignites in AP... Amaravati versus Mavigan...

    Capital War: ఏపీలో మళ్లీ క్యాపిటల్ వార్.. అమరావతి వర్సెస్ మావిగన్..

Latest News

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd