HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Good News For Unemployed Youth In Andhra Pradesh

ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్

  • Author : Vamsi Chowdary Korata Date : 30-01-2026 - 2:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Andhra Pradesh Logo
Andhra Pradesh Logo

Andhra Pradesh  ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ కోసం ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల దిశగా కసరత్తు జరుగుతోంది. ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేపట్టే దిశగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పకడ్బందీగా జాబ్ క్యాలెండర్ నిర్వహణకు మంత్రి లోకేష్ అధికారులకు సూచనలు చేసారు. దీంతో.. అధికారులు శాఖలవారీగా భర్తీ చేయాల్సిన ఉద్యోగాల వివరాలు సేకరిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ ఉండనుందని అధికారులు చెబుతున్నారు.

ఏపీలో ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతోంది. జాబ్ క్యాలెండర్ ప్రకటన దిశగా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. శాఖల వారీగా భర్తీ చేయాల్సిన పోస్టులతో పాటుగా కాంట్రాక్టు ఉద్యోగుల వివరాల లెక్కలు సిద్దం చేస్తోంది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని నిధి హెచ్‌ఆర్‌ఎంఎస్‌ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయిస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు అన్ని శాఖల్లో కలిపి 30% వరకు ఖాళీలు ఉండగా వీటిలో కొన్ని పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. వీటి భర్తీకి సంబంధించిన ప్రక్రియను ఖరారు చేయనున్నారు. శాఖల వారీగా ఖాళీలను నిర్ధారించారు. ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటన దిశగా కసరత్తు వేగవంతం చేసింది. ఏపీపీఎస్సీ ద్వారా దాదాపు 20 నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఇప్పటికే డీఎస్సీ -2025 ఉద్యోగాల భర్తీ పూర్తి చేసారు. వచ్చే ఫిబ్రవరి లో మరో డీఎస్సీ నోటిఫికేషన్ కు రంగం సిద్దం చేస్తున్నారు.

శాఖల వారీగా ఖాళీలు

కాగా.. ఇప్పటి వరకు 157 విభాగాల మంజూరు పోస్టులు, ఖాళీల వివరాలను నిర్ధారించాయి. దాదాపుగా 99 వేల ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్ మెంట్ విధానంలో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ పూర్తయితే నే మొత్తం ఖాళీల లెక్క తేలనుంది. నేరుగా నియామకాలకు వచ్చే వాటిని నిరుద్యోగ యువతతో ఆర్థిక శాఖ వద్ద ఉన్న వివరాల ప్రకారం రెవెన్యూ శాఖలో మొత్తం 13,000 ఖాళీలు. ఈ శాఖలోని 7 హెచ్‌ఓడీలు ఇప్పటి వరకు 4,787 ఖాళీలను నిర్ధారించాయి. వీటిలో నేరుగా నియామకాలకు వచ్చేవి 2,552 గా తేల్చారు. అదే విధంగా ఉన్నత విద్యాశాఖలో 7 వేల పోస్టులు ఖాళీలు ఉండగా.. యూనివర్సిటీల్లో 3 వేలకు పైగా ఉన్న ఖాళీలను కోర్టు కేసులు తొలగించి భర్తీ చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టింది.

కాగా, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో ఉన్న 27 వేల ఖాళీల్లో సుమారు 23 వేలకు నేరుగా నియామకాలు చేపట్టాల్సి ఉంది. నైపుణ్యా భివృద్ధి, శిక్షణ విభాగంలో 4 వేలకు పైగా ఖాళీలు నిర్ధారించారు. వ్యవసాయ శాఖలో 3 వేలకు పైగా ఖాళీలుండగా వీటిలో డీఆర్‌ పోస్టులు 2,400.పంచాయతీరాజ్‌ శాఖలో నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులు 26 వేల వరకు ఉండొచ్చని నిర్ధారించారు. మరో మూడు వేల పోస్టులను ఇన్‌సర్వీస్‌ పదోన్నతులతో భర్తీ చేస్తారు. ఖాళీల పైన అధికారికంగా స్పష్టత వచ్చిన తరువాత ప్రభుత్వం షెడ్యూల్ ఫిక్స్ చేసి ఉగాది నాడు అధికారికంగా విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh jobs
  • Andhrapradesh Govt
  • AP CM Chandrababu Naidu
  • AP Employment News
  • AP Government Jobs
  • AP Job Calendar
  • AP Kutami Govt
  • AP Teacher Jobs
  • Constable Jobs
  • Government Vacancies
  • Head Constable jobs
  • job calendar
  • job calendar 2026
  • Teacher Jobs
  • Ugadi Job Calendar

Related News

Chandrababu

iGOT కర్మయోగి పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu  ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాలను పెంచే ‘ఐగాట్ కర్మయోగి’ పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు సృష్టించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది అద్భుతమైన వార్త అని, ప్రభుత్వ ఉద్యోగులు నిరంతర అభ్యాసంపై చూపుతున్న నిబద్ధతకు ఈ ఘనత నిదర్శనమని ఆయన అన్నారు. నైపుణ్యం, చురుకుదనం, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా పరిపాలనను నిర్మించడమే తమ లక్ష్యమని

  • Chandrababu Naidu Job Calen

    ఏపీలో కొలువుల జాతర: ఉగాదికి జాబ్ క్యాలెండర్?

  • Chandrababu Family

    ఒక్కసారిగా పడిపోయిన హెరిటేజ్ షేర్లు.. చంద్రబాబు సతీమణికి రూ. 80 కోట్లకుపైగా లాస్!

  • India Republic Day

    రాజధాని అమరావతిలో తొలిసారి ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

  • Chandrababu Naidu About Greatness Of Paritala Ravi On His Death Anniversary

    పరిటాల రవీంద్ర వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి

Latest News

  • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

  • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

  • మూత్రం రంగును బట్టి మీ ఆరోగ్యాన్ని ఎలా గుర్తించాలి?

  • ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్

  • అతడి భార్య అందంగా ఉందని పదవి ఇచ్చా..నోరు జారిన డోనాల్డ్ ట్రంప్..!

Trending News

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

    • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd